జేసీ బ‌స్సు బీభ‌త్సం

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-02-05 04:41:04

జేసీ బ‌స్సు బీభ‌త్సం

అనంత‌పురం పార్ల‌మెంట్ స‌భ్యులు జేసీ దివాకర్‌ రెడ్డి కుటుంబానికి చెందిన జేసి  ట్రావెల్స్  బస్సు బీభత్సం సృష్టించింది. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద దివాకర్ బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
 
ట్రావెల్స్‌ నిర్లక్ష్యంపై ప్రయాణికులు భగ్గుమన్నారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.  అయితే అధికార పార్టీ నేతకు చెందిన ట్రావెల్స్ కావడంతో పోలీసులు ఆచితూచి స్పందిస్తున్నారు. గ‌తంలోనూ అనేక సార్లు జేసీ ట్రావెట్స్ కు సంబంధించిన బస్సులు ప్ర‌మాదాల‌కు గురైన విష‌యం తెలిసిందే.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.