క‌ర్నూల్ ఫారెస్ట్‌ అధికారి రాసలీలలు

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-01-23 03:08:27

క‌ర్నూల్ ఫారెస్ట్‌ అధికారి రాసలీలలు

క‌ర్నూలు జిల్లాలో  విద్యార్ధి నాయ‌కులు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఓ  అట‌వీ శాఖ అధికారి రాస‌లీల వ్య‌వ‌హారాన్ని  బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. అట‌వీ శాఖ‌లో డీఎఫ్ ఓగా విధులు నిర్వ‌హిస్తోన్న వెంక‌టేశ్వ‌ర రావు గెస్ట్ హౌస్ లో ఓ మ‌హిళ‌తో ఉండ‌గా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. 
 
గ‌త కొంత కాలంగా వెంక‌టేశ్వ‌ర్లు మ‌హిళ‌ల‌ను వేధిస్తునార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈక్ర‌మంలో విద్యార్ధి నాయ‌కులు స‌ద‌రు అధికారి  పై నిఘా పెట్టి సోమ‌వారం రాత్రి ఓ మ‌హిళ‌తో   గెస్ట్ హౌస్ లో  ఉండ‌గా  పోలీసుల‌కు స‌మాచారం అందించారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు  వెంక‌టేశ్వ‌ర్ రావుతో పాటు ఆయ‌నతో ఉన్న మ‌హిళ‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈయ‌న‌పై గ‌తంలో అనేక  ఆరోప‌ణ‌లు ఉన్నా కూడా పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో  విద్యార్ధి నాయ‌కులు ఇలా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టించిన‌ట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.