జ‌ర్న‌లిస్ట్ యువ‌తిపై ఎమ్మెల్యే అత్యాచారం

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-02-03 12:43:00

జ‌ర్న‌లిస్ట్ యువ‌తిపై ఎమ్మెల్యే అత్యాచారం

స‌మాజాన్ని కాపాడ‌వ‌ల‌సిన ఎమ్మెల్యే  బ‌రితెగించి జ‌ర్న‌లిజం చ‌దువుతున్న ఓ యువ‌తి  పై అత్యా చారం చేశాడు.. ఈ అత్యాచార  ఘ‌ట‌న ఇప్పుడు దేశ‌మంతా  క‌ల‌క‌లం రేపుతోంది... త‌న‌పై ఓ ఎమ్మెల్యే అత్యాచారం చేశాడంటూ ఆ యువ‌తి పోలీస్ అధికారుల‌కు లేఖ రాయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది... ఈ దారుణ‌మైన ఘ‌ట‌న  మ‌ధ్య‌ప్ర‌దేశ్  రాష్ట్రంలో చోటు చేసుకుంది.
 
పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... జ‌ర్న‌లిజం చ‌దువుతున్న ఓ విద్యార్థిని  పై  కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమంత్ క‌టారే అనే ఎమ్మెల్యే అత్యాచారం చేశాడంటూ ఆ యువ‌తి జైళ్ల శాఖ‌కు చెందిన డీఐజీ  అధికారికి లేఖ రాసింది...  ఆమె ఫిర్యాదు మేర‌కు,  భోపాల్ మ‌హిళా పోలీస్ స్టేష‌న్ లో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు  చేప‌డుతున్నారు. 
 
దీంతో హేమంత్ క‌టారే త‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేశార‌న్న విష‌యం తెలియ‌గానే  అజ్ఞాతంలోకి  వెళ్లిపోయారు... ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గ‌తంలో జ‌ర్న‌లిజం చ‌దువుతున్న ఆ యువ‌తి కొద్ది కాలంగా త‌న‌ను భ‌య‌పెడుతోంద‌ని, ఆమె  ఫిర్యాదు చేయ‌క ముందే భోపాల్ క్రైమ్ బ్రాంచ్ లో ఆయువ‌తి పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని  క‌టారే తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.