పెళ్లి తెచ్చిన తంటా

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-02-03 05:00:42

పెళ్లి తెచ్చిన తంటా

మ‌రి కొద్ది రోజుల్లో పెళ్లి పీట‌లెక్కి...త‌నకు కాబోయే  భర్త‌తో క‌లిసి  ఏడ‌డుగులు వేయ‌వ‌ల‌సిన ఓ యువ‌తి పై పేద‌రికం 
క‌న్నెర్ర చేసింది... క‌ష్టాల క‌డలి నుంచి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించ‌కుండానే త‌న నిండు జీవితాన్ని బ‌లితీసుకుంది.. త‌ల్లి దండ్రుల‌కు భారం కాకూడ‌దు అని, ఆమె తీసుకున్న నిర్ణ‌యం చివ‌ర‌కు ఆమె త‌ల్లి దండ్రుల‌కు గ‌ర్బశోకాన్ని మిగిల్చింది వివ‌రాల్లోకి వెళితే..?
 
విజ‌య‌న‌గ‌రం జిల్లా శిష్టుసీతారాంపురానికి చెందిన శిష్టు తిరుప‌తి అనే వ్య‌క్తికి ముగ్గురు కుమార్తెలు ... ఈ ముగ్గురు కుమార్తెల‌లో పెద్ద కుమార్తెకు ఇటీవ‌ల కొంత పొలం అమ్మి పెళ్లి చేశాడు తిరుప‌తి.. ఇక రెండ‌వ కుమార్తెకు కూడా పెళ్లి చేయాలి అని మంచి సంబంధం చూశాడు,
 
ఇక త‌నకు ఉన్నా కాస్త పొలంలోనే సాగు చేసుకుంటూ కాలం వెళ్ల‌దీస్తోంది తిరుప‌తి కుటుంబం... అయితే రెండ‌వ కుమార్తె వివాహానికి ఉన్నా పొలాన్నికూడా  అమ్మాలి అని నిర్ణ‌యించుకున్నాడు తిరుప‌తి .. ముందుగా ఆమెకు నిశ్చితార్దం చేయించారు.. ఈ లోగా పెళ్లి స‌మ‌యానికి ఆ పొలం అమ్మాలి అని నిర్ణ‌యించుకున్నాడు తిరుప‌తి.. కాని ఆ యువ‌తికి ఆ భూమి విక్ర‌యం అనే మాట న‌చ్చ‌లేదు, త‌న పెళ్లి కోసం త‌న కుటుంబం రోడ్డుపాలు అవుతుంది అని, త‌న తర్వాత త‌న చెల్లి భ‌విష్య‌త్తు ఎలా ఉంటుంది అని ఆలోచించింది ఆ యువ‌తి.. అందుకే  తల్లి దండ్రులు పొలానికి వెళ్లిన స‌మ‌యంలో పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. ఆమెకు వాంతులు అవ‌డం చూసి ఆమెను ఆస్ప‌త్రికి తీసుకువెళ్లిన త‌ల్లి దండ్రుల‌కు ఆమె చివ‌రి చూపు మాత్ర‌మే ద‌క్కింది. ఆమె ప్రాణాలు విడిచింది.
 
!! ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కుటుంబాల్లో,  వ‌ర‌కట్నాలు అమ్మాయిల జీవితాల‌ను బ‌లిచేసేలా ఉండ‌కూడ‌దు అనేది కాస్త గ్ర‌హించాల్సిన అంశం!!

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.