పెళ్లి చేసుకున్న పాపానికి యువ‌తికి శిక్ష ఏమిటంటే?

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-01-26 04:38:48

పెళ్లి చేసుకున్న పాపానికి యువ‌తికి శిక్ష ఏమిటంటే?

కొద్ది రోజుల క్రితం ఓ ప్రేమ జంట.. త‌మ ప్రేమ‌ను పెద్ద‌లు ఒప్పుకోక పోవ‌డంతో వారిని ఎదిరించి వివాహం చేసుకున్నారు... త‌మ కూతురు క‌నిపించ‌క పోవ‌డంతో ఆ యువ‌తి త‌ల్లిదండ్రులు కొద్ది రోజుల కింద పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.... అయితే వారి ఫిర్యాదు మేర‌కు ప‌లు న‌గ‌రాల‌ను గాలించి ఈ నెల 22 వ తేదిన ప్రేమ జంట‌ను పోలీసులు వారి స్వ‌గ్రామానికి చేర్చారు.

ఈ నేప‌థ్యంలో త‌మ‌ను కాద‌ని పెళ్లి చేసుకుంద‌న్న బాధ‌లో ఆ యువ‌తి త‌ల్లిదండ్రులు క‌న్న కూతూర‌ని కూడా చూడ‌కుండా, ఆ యువ‌తికి గుండు కొట్టించారు... ఈ ఘోర సంఘ‌ట‌న ఉధ్య‌మాల పురిటి గ‌డ్డ వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఆయువ‌తి ప్ర‌వీణ్ అనే యువ‌కుడిని పెళ్లి చేసుకుని విడిగా ఉంటున్నారు ఈ జంట‌.. త‌మ కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవ‌డంతో త‌మ‌కు అవ‌మానం జరిగింద‌ని భావించిన యువ‌తి త‌ల్లి దండ్రులు, ఆమెను ఇంటికి తీసుకువ‌చ్చిన త‌ర్వాత గుండు కొట్టించి బంధువుల ఇంట్లో ఉంచారు.

ఈ విష‌యం తెలుసుకున్న ఆమె భ‌ర్త ప్ర‌వీణ్.. త‌న భార్య‌ను బ‌ల‌వంతంగా తీసుకు వెళ్లారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు... అయితే అత‌ని ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.