ఆడ‌పిల్ల‌ను క‌న్నందుకు భార్య‌కు క‌రెంట్ షాక్

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-02-04 06:32:15

ఆడ‌పిల్ల‌ను క‌న్నందుకు భార్య‌కు క‌రెంట్ షాక్

ఒకే గ్రామానికి చెందిన యువ‌తీ, యువ‌కుడు కులాలు వేరు అయినా కాని వారి మ‌న‌సు ఒక‌టి కావ‌డంతో  కులాంత‌ర వివాహం చేసుకున్నారు... ఈ పెళ్లికి కుటుంబ పెద్ద‌లు నిరాక‌రించినా... వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి చేసుకున్న త‌ర్వాత కొంత కాలానికి  వీరిద్ద‌రి దాంప‌త్యానికి ఒక మ‌గ‌ పురుషుడు జ‌న్మించాడు... 
 
కొంత  కాలంగా భార్య భ‌ర్త‌ల మ‌ధ్య విభేదాలు రావ‌డంతో త‌రుచూ ఆ యువ‌తి భ‌ర్త అద‌నంగా క‌ట్నం తీసుకురావాలంటూ త‌రుచు వేధిస్తున్నాడు... ఇంత‌లో విరీద్ద‌రి దాంప‌త్యానికి  ఆడ శిశువు కు  జ‌న్మ‌నియ‌డంతో ఆ యువ‌తికి క‌రెంట్ షాక్ ఇచ్చి మ‌రీ హింసించాడు... ఈ సంఘ‌ట‌న కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది...
 
పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.... పెనమలూరుకు చెందిన శీలం రాజారత్నం, ప్రశాంతిలు 2014లో కులాంతర వివాహం చేసుకున్నారు. రాజారత్నం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఇంటి దగ్గర నుంచే ఆన్‌లైన్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. వివాహం అయిన కొంతకాలం నుంచే భార్యపై త‌రుచు వేధింపులకు పాల్పడేవాడు.... అనుమానంతో బయటకు వెళ్లేటప్పుడు ఇంటికి తాళాలు బిగించుకుని వెళ్లేవాడు. 
 
అయితే భర్త వేధింపుల పై భార్య గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా పెద్ద మనుషులు రాజీ చేయడంతో కేసు వాప‌స్ తీసుకున్నారు.... ఇటీవల ప్ర‌శాంతికి పాప పుట్టింది.... ఆడపిల్ల పుట్టడంతో భర్త రాజా భార్యపై కక్ష పెంచుకుని ఎవ‌రూలేని స‌మ‌యంలో త‌న భార్య గాఢంగా నిద్రిస్తున్న వేల‌లో క‌రెంట్ షాక్ ఇచ్చి చంపాల‌ని య‌త్నించాడు... దీంతో ప్ర‌శాంతి గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో రాజు భ‌య‌ప‌డి పారిపోయాడు... ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌శాంతి పోలీసుల‌కు తెలుప‌డంతో కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.