హైద‌రాబాద్ లో ఘోర విషాదం

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-01-27 01:30:37

హైద‌రాబాద్ లో ఘోర విషాదం

నేడు సూర్యుడు అస్తమించ‌కుండానే హైద‌రాబాద్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది... లాడ్లీ త‌న భ‌ర్త సాయ్ ముదిర‌జ్ ను వివాహం చేసుకొని కొంత‌కాలంగా న‌గ‌రంలోని కూక‌ట్ ప‌ల్లిలోని శ్రీనిధి అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు... అయితే ఇంత‌లో ఏం జ‌రిగిందో ఏమో ఈ రోజు తెల్ల‌వారు జామున లాడ్లీ వారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ఐదో అంత‌స్తు నుంచి కింద‌ప‌డి తీవ్రంగా గాయ‌ప‌డింది.

వెంట‌నే చుట్టుప‌క్క‌ల ఉన్న‌టు వంటి స్థానికులు గ‌మ‌నించి హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. లాడ్లీ చికిత్స పొందుతూ మృతిచెందింది... ముదిర‌జ్ త‌ర భార్య మ‌ర‌ణ వార్త‌ను లాడ్లీ కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేశారు... త‌న కూతురు మ‌ర‌ణ వార్త విన‌గానే క‌న్నీరు మున్నీరు అయిన త‌ల్లిదండ్రులు లాడ్లీ చావుకు కార‌ణం ముదిర‌జ్ అని, అత‌నిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.