సార్ న‌న్ను జైల్లో పెట్టండి అంటూ లేఖ‌

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-02-05 05:27:50

సార్ న‌న్ను జైల్లో పెట్టండి అంటూ లేఖ‌

త‌న భార్య, పిల్ల‌ల‌ను హ‌త్య చేసిన‌ ఓ వ్యక్తి పై కేసు న‌మోదు అయింది...  ఆ తర్వాత వాదోప వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం అత‌ని భార్య పిల్ల‌ల‌ను ఆ వ్య‌క్తే హ‌త్య చేశాడ‌ని  నిర్ధారించింది.. అత‌నికి యావ‌జ్జీవ కారాగార‌ శిక్ష విధించింది కోర్టు... దీంతో య‌వ్వ‌న కాల‌మంతా జైల్లోనే గ‌డ‌ప‌డంతో  అక్క‌డున్న‌టు వంటి వారితో బాగా ప‌రిచ‌యం పెంచుకున్నాడు ఆ వ్య‌క్తి... సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని, కొద్ది రోజుల క్రితమే  విడుద‌ల అయ్యాడు... ఇంత‌లో ఏమైందో ఏమో కాని, తిరిగి త‌న‌ను జైలుకు పంపండి సార్... అంటూ ఆ వ్య‌క్తి  జైళ్ల‌ శాఖ‌కు ఒక లేఖ రాశాడు.
 
వివ‌రాల్లోకి వెళితే... ఉత్త‌రాఖాండ్ లోని బ‌స్త‌దీ గ్రామానికి చెందిన పుష్క‌ర్ అనే వ్య‌క్తి, త‌న భార్య పిల్ల‌ల‌ను హ‌త్య‌చేసి జైలుకు వెళ్లాడు...న్యాయ‌స్థానం విధించిన శిక్షను అనుభ‌వించి గ‌త ఆరు నెల‌ల క్రితం విడుద‌ల అయ్యాడు... పుస్క‌ర్ విడుద‌ల అయిన వెంట‌నే నేరుగా త‌న గ్రామానికి చేరుకున్నాడు.
 
త‌న  గ్రామానికి చేరుకోగానే అక్క‌డున్న‌టువంటి ప‌రిస్థితిని చూసి తీవ్ర నిరాశ‌కు గురయ్యాడు... కొన్ని సంవ‌త్స‌రాల క్రితం ఆ గ్రామానికి భారీగా వ‌ర‌ద‌లు రావ‌డంతో, ఇళ్ల‌తో స‌హా అక్క‌డ అన్కీ కొట్టుకుపోయాయి... దీంతో ఆ గ్రామం పాడు పోయిన గ్రామంగా మారిపోయింది... ఈ వ‌ర‌దల్లో సుమారు 21 మంది మ‌ర‌ణంచ‌గా, మిగిలిన వారు వేరే ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్లి పోయారు... దీంతో ఆ గ్రామంలో పుస్క‌ర్ ఒక్క‌డే ఉండి పోయాడు... త‌న‌కు తెలిసినవారు లేక పోవ‌డంతో.. మ‌న‌స్తాపానికి గురైన పుష్క‌ర్ తిరిగి త‌న‌ను జైలుకు తీసుకు వెళ్లాల‌ని కేంద్ర కారాగార అధికారుల‌కు లేఖ రాశాడు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.