ప్ర‌ణ‌య్ హ‌త్య గురించి న‌మ్మ‌లేని నిజాలు చెప్పిన అమృత‌

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-09-15 02:31:17

ప్ర‌ణ‌య్ హ‌త్య గురించి న‌మ్మ‌లేని నిజాలు చెప్పిన అమృత‌

త‌న భ‌ర్త ప్ర‌ణ‌య్ చంపింది త‌న తండ్రి మారుతీరావు అని ఆరోపించింది అమృత‌. ప్ర‌ణ‌య్ చాలా మంచివాడ‌ని ఆయ‌న‌ను చంప‌డానికి చాలా రోజులుగా రెక్కి నిర్వ‌హించార‌ని ఆమె విల‌పించింది. అయితే తాను పుట్టింటికి వెళ్లేదే లేదని త‌న భ‌ర్త‌ను చంపితే తాను పుట్టింటికి వ‌స్తుంద‌ని భావించి త‌న తండ్రి ఇలా చేయించాడ‌ని చెప్పి ప్ర‌ణ‌య్ భార్య అమృత స్టేట్ మెంట్ ఇచ్చింది. 
 
అంతేకాదు ప్ర‌ణ‌య్ హ‌త్య జ‌రిగిన వెంట‌నే త‌న తండ్రి ఫోన్ చేసిన‌ట్లుగా అమృత పేర్కొంది. అయితే ప్ర‌ణ‌య్ హ‌త్య కేసులో అమృత తండ్రి బాబాయ్ ఇద్ద‌రు కూడా ప‌రారిలో ఉన్నారు. ఇక ఈ హ‌త్య‌కు సంబంధించి ఇద్ద‌రు నిందితుల‌ను పోలీసులు గొల్కండ ద‌గ్గ‌ర అదుపులోకి తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. హంత‌కుడు ఎవ‌రైతే దాడి చేశారో ఆ హంత‌కుడు గ‌త కొన్ని రోజులుగా ప్ర‌ణ‌య్ ఇంటిముందు రెక్కి నిర్వ‌హించి అత‌ని గ‌మ‌నిక‌ల‌ను గ‌మ‌నిస్తూ స్కెచ్ గిశాడని తెలుస్తోంది.
 
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.