అన్నాచెల్లెళ్ల ప్రేమాయ‌ణం చివ‌రికి ఏం చేశారో చూడండి

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

crime
Updated:  2018-06-29 05:11:19

అన్నాచెల్లెళ్ల ప్రేమాయ‌ణం చివ‌రికి ఏం చేశారో చూడండి

టెక్నాల‌జి పెరిగిందంటే మ‌నుషుల ఆలోచ‌న‌లు పెరుగుతాయి, శ్ర‌మ త‌గ్గుతుంది, ఏ ప‌ని చేయాల‌న్నా ఈజీగా చెయోచ్చు అని ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రు ఆలోచిస్తుంటారు,  అలా ఆలోచిస్తే ఎవ్వ‌రికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండ‌వు. కానీ కొంత‌మంది మాన‌వ‌త్వానికి మ‌చ్చ‌తెచ్చే విధంగా ఆలోచిస్తే రిలేషన్‌ షిప్ దెబ్బ‌తింటుంది
 
అయితే తాజాగా ఇలాంటి రిలేషన్‌ షిప్ దెబ్బ‌తినే విధంగా ఆలొచించి ఇద్ద‌రు యువ‌తీ, యువ‌కుడు  ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అబ్బాయి ఇంట‌ర్ చ‌దువుతున్నాడు, అమ్మాయి ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. వారిద్ద‌రు ఒకే స్కూల్ ల్లో చ‌దువుకోవ‌డంతో ఒకరికొక‌రు ఘాడంగా ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి చేసుకుంటామ‌ని ఇంట్లోని పెద్ద‌లకు చెప్పారు. అయితే  వారి ప్రేమ‌ని పెద్ద‌లు నిరాక‌రించారు. దీంతో వారిద్ద‌రు రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది.
 
వివ‌రాళ్లోకి వెళ్లే.... వారిద్ద‌రు ఒకే ఫ్యామిలీ, ద‌గ్గ‌ర బంధువులు వ‌రుస‌కు అన్నా చెల్లెళ్లు, కానీ ప్రేమించుకున్నారు. ఇక వారిద్ద‌రు పెళ్లి చేసుకుంటామ‌ని పెద్ద‌లకు తెగేసి చెప్పారు. కానీ పెద్ద‌లు వారిని మంద‌లించి, వావి వ‌రుస‌లు లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటార‌ని హిత‌భోదించారు. దీంతో త‌మ ప్రేమ‌ను పెద్ద‌లు అర్థం చేసుకోర‌ని తెలిసి వీరిద్ద‌రు క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. 
 
మీరెలాగూ ఒప్పుకోరు అందుకే మేం చచ్చి మా ప్రేమను బతికించుకుంటాం అంటూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎప్ప‌టిలానే ఈ రోజు కూడా వీరిద్ద‌రు స్కూల్ వెళ్లారు. బ్ర‌తికి ఉంటే పెద్ద‌లు మ‌న‌కు పెళ్లి చెయ్య‌రు. మ‌నం చ‌నిపోయి మ‌న ప్రేమ‌ను బ్ర‌తించుకుందాని నిర్ణయం తీసుకుని  ఆ ఇద్దరు అన్నాచెల్లెళ్లు కుడియాకురిచ్చి సమీపంలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలు వచ్చే సమయంలో దూకేసి ప్రాణాలు వదిలారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.