ప్రియుడి కోసం తండ్రిని ఏం చేసిందంటే..?

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-01-20 09:59:51

ప్రియుడి కోసం తండ్రిని ఏం చేసిందంటే..?

మాన‌వ సంబంధాలు మంట‌గ‌లిసిపోతున్నాయి.. త‌ల్లి దండ్రులు... అన్న‌ద‌మ్ములు... అక్కా చెల్లెల్లు.. అనే బంధాల‌కు బంధుత్వాల‌కు విలువ‌లు లేకుండా పోతున్నాయి.. ప్రేమ అనే ఉచ్చులో ప‌డి త‌మ జీవితాలు నాశనం చేసుకుంటున్న యువ‌త‌ను ఎంతో  మందిని చూస్తున్నాం.. చివ‌ర‌కు త‌ల్లి దండ్రుల‌కు కూడా  మ‌చ్చ తెచ్చిపెడుతున్నారు.. కాని నోయిడాలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న స‌భ్య‌స‌మాజంలో ఓ క‌నువిప్పుని క‌లిగిస్తోంది.

నోయిడాలో ఓ యువ‌తి త‌న ప్రియుడిని కాపాడుకోవ‌డం కోసం క‌న్న తండ్రినే చంపేసింది..నోయిడాకి చెందిన  పూజ అనే యువతి  తెల్లవారుజామున తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది... ఆ స‌మ‌యంలో త‌ల్లి దండ్రులు నిద్రిస్తున్నారు.. పూజ గ‌ది వేరుగా ఉండ‌టంతో అక్క‌డ చిన్న అలికిడి విన‌బ‌డింది.. దీంతో పూజ‌ తండ్రి  విశ్వ‌నాథ్ కుమార్తె గ‌దికి వెళ్లారు.. ఆ స‌మ‌యంలో కుమార్తె వేరే వ్య‌క్తితో  చ‌నువుగా ఉండ‌టం చూసి అత‌నిపై చేయిచేసుకున్నాడు.

ఆ స‌మ‌యంలో త‌న ప్రియుడిని విడిపించ‌డం కోసం, మెట్ల పై నుంచి ప్రియుడిని త‌ప్పించి తండ్రిని పై నుంచి తోసి వేసింది.. దీంతో పూజ తండ్రి మూడో అంత‌స్తు  నుంచి కింద‌ప‌డిపోయాడు.. ఈ గొడ‌వ తెలుసుకున్న ప‌క్క‌వారు వెంట‌నే ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న ఆ వ్య‌క్తిని స్దానిక ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు.. కాని చికిత్స పొందుతూ పూజ తండ్రి విశ్వ‌నాథ్ మృతిచెందాడు.. త‌న భ‌ర్త చావుకు కార‌ణ‌మైన త‌న కుమార్తును, ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేయాల‌ని పూజ త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. పూజ ప్రియుడు ప‌రారీలో ఉన్నాడ‌ని పోలీసులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌చేశారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.