బ్రేకింగ్ కులాంత‌ర వివాహం చేసుకున్నందుకు టార్చ‌ర్

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

crime
Updated:  2018-09-20 12:48:54

బ్రేకింగ్ కులాంత‌ర వివాహం చేసుకున్నందుకు టార్చ‌ర్

ఓ యువ‌కుడు తాజాగా త‌న ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్య చేసుకునే ప్ర‌య‌త్నం చేసిన ఘ‌ట‌న హైద‌రాబాద్ పాతబ‌స్తీలో క‌ల‌క‌లం రేపింది. నాలుగేళ్ల క్రితం శ్రీకాంత్ అనే వ్య‌క్తి  ఓ యువ‌తిని ప్రేమించి కొద్దిరోజుల క్రితం కులాంత‌ర వివాహం చేసుకున్నాడు. అయితే పోలీస్ డిపార్ట్ మెంట్ లో ప‌నిచేస్తున్న ఆమె తండ్రి ఆ యువ‌కుడిని బెదిరించి కూతురిని త‌న నివాసానికి తీసుకు వెళ్లిపోయారు. 
 
అంతేకాదు త‌న కూతురుకి అబార్ష‌న్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విష‌యం తెలుసుకున్న శ్రీకాంత్ తీవ్ర మ‌న‌స్థాపానికి గురిఅయి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. దీంతో తీవ్ర గాయాల‌తో ప‌డిఉన్న ఆ యువ‌కుడిని స్ధానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉంది. త‌న ఆత్మ‌హ‌త్య‌కు ముందు శ్రీకాంత్ త‌న బాధ‌ను సెల్ఫీ వీడియోలో చెప్పుకున్నాడు.
 
త‌న చావుకు కార‌ణం త‌న భార్య ఆమె తండ్రితో పాటు అత‌ని భార్య ఆ కుటుంబానికి చెందిన వారు ఉన్నార‌ని తెలిపారు. త‌న‌కు తెలియ‌కుండా 7 నెల‌లు నిండిన త‌న భార్య‌కు అబార్ష‌న్ చేయించార‌ని ఆరోపించారు. అంతేకాదు త‌న‌పై త‌న కుటుంబ స‌భ్యుల‌పై కేసు పెట్టించార‌ని శ్రీకాంత్ ఆరోపించాడు. ఆ యువ‌తిని పెళ్లి చేసుకున్న పాపానికి త‌న‌ను టార్చ‌ర్ కు గురిచేశార‌ని శ్రీకాంత్ వాపోయాడు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.