ఏమీలేద‌ని చేర‌దీస్తే భార్య చెళ్లెలిపై కూడా పశువాంఛ

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

crime
Updated:  2018-06-30 12:32:33

ఏమీలేద‌ని చేర‌దీస్తే భార్య చెళ్లెలిపై కూడా పశువాంఛ

అత‌డు కూటికోసం ఓ రెస్టారెంట్ లో ప‌నిచేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. ఇంత‌లో ఇక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాస్త‌వానికి వీరిద్ద‌రిది కులాంత‌ర వివాహం అయినా కూడా ఆ అమ్మాయి త‌ల్లిదండ్రులు చేర‌దీసి పెళ్లి చేసి త‌న నివాసంలో ఉంచుకుని అత‌నికి ఏలోటు రాకుండా చూసుకుంటున్నారు. కానీ అత‌ని కామ బుద్ది మాత్రం పోగొట్టుకోలేదు. ఇంట్లో ఎవ్వ‌రు లేని స‌మయం చూసుకుని తన భార్య చెల్లెలిపై అత్యారం చేశాడు. ఈ ఘ‌ట‌న తాజాగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో వెలుగు చూసింది.
 
భానుచందర్‌ భార్య చెల్లెలు ఏడో తరగతి చదువుతోంది. ఇంట్లో ఎవ్వ‌రు లేని స‌మ‌యం చూసుకుని ఆ ఆబాలికను లొంగ‌దీసుకుని భానుచందర్ కామ కోర్కెల‌ను తీర్చుకున్నాడు. ఇక త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి ఎవ‌రికైనా చెబితే తిడుతార‌నే ఉద్దేశ్యంతో ఆ బాలిక ఈ విష‌యాన్ని త‌న‌లోనే దాచుకుంది. అయితే ఈ క్ర‌మంలో ఆ బాలిక ఆరోగ్యం క్షీణించ‌డంతో వాంతులు చేసుకుంది. దీంతో త‌ల్లిదండ్ర‌లు హుటాహుటిన ఆ బాలికను ప్రైవేట్ అసుప‌త్రికి త‌ర‌లించారు.
 
వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన డాక్ట‌ర్లు ఆ బాలిక గ‌ర్భ‌వ‌తి అని తెలిపారు. ఇక ఈ విష‌యం తెలిస్తే ప‌రువు పోతుంద‌ని తెలియ‌డంతో త‌మ కూతురికి అబార్షన్ చేయ‌మ‌ని త‌ల్లిదండ్ర‌లు డాక్ట‌ర్ల‌ను వేడుకున్నారు. కానీ డాక్ట‌ర్లు అబార్షన్ కు నిరాక‌రించారు. ఆ బాలికకు తాము అబార్షన్ చేస్తే చ‌ట్ట‌రిత్య‌నేరం అవుతంద‌ని తెలిపారు. ఒక‌వేళ‌ అబార్షన్ చేసినా ప్రాణాకికే ప్ర‌మాదం అని స్ప‌ష్టం చేశారు. ఇక ఈ ఘ‌ట‌న‌పై డాక్ట‌ర్లు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్య‌డంతో పోలీసులు ఆ బాలిక‌ను విచారించగా నిందుతుడు త‌న బావ‌నే అని తేల‌డంతో ఆ యువ‌కుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.