పెళ్లికి ముందు ఎంత దారుణం చేశారు అంటే ?

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-02-20 02:35:58

పెళ్లికి ముందు ఎంత దారుణం చేశారు అంటే ?

మ‌రో రెండు రోజుల్లో పెళ్లి.... పెళ్లి హ‌డావుడిలో బిజీగా ఉన్నారు కుటుంబ స‌భ్యులు...ఇంత‌లో  కాబోయే వ‌రుడుపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు,పెట్రోల్ తో దాడి చేయ‌డంతో భ‌యాందోళ‌నకు గుర‌వుతున్నారు త‌ల్లిదండ్రులు... ఈ  సంఘ‌ట‌న జ‌న‌గామ జిల్లా ర‌ఘ‌నాథ‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. 
 
మ‌రి కొన్ని రోజుల్లో పెళ్లి పీట‌లెక్క‌వ‌ల‌సిన వ‌రుడు యాద‌య్య, త‌నకు కాబోయే భార్య అరుణ తో ఆదివారం నాడు రాత్రి ఫోన్ లో మాట్లాడుతున్నాడు... అయితే వీరిరువురు మాట్లాడుతున్న స‌మ‌యంలో సిగ్న‌ల్ ప్రాబ్ల‌మ్ రావ‌డంతో యాద‌య్యను  అరుణ బ‌య‌టికి వ‌చ్చి మాట్లాడ‌మంది.
 
దీంతో ఇదే స‌మ‌యాన్ని అదునుగా చేసుకొని గుర్తు తెలియ‌ని ఇద్ద‌రు వ్య‌క్తులు  యాద‌య్య‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి ప‌రార‌య్యారు... మంట‌ల్లో చిక్కుకున్న యాదయ్య గ‌ట్టిగా కేక‌లు వేసుకుంటూ త‌న త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తాడు... త‌న కుమారుడు మంట‌ల్లో చిక్కుకోవ‌డంతో, త‌ల్లి యాద‌మ్మ మంట‌లు ఆర్ప‌డానికి ప్ర‌య‌త్నించింది... ఆ మంట‌ల్లో ఆమెకు కూడా గాయాల‌య్యాయి. 
 
ఈ ఘ‌ట‌న‌ను అక్క‌డున్న‌టు వంటి స్థానికులు గ‌మ‌నించి, వెంట‌నే  చికిత్స నిమిత్తం వారిని  అంబులెన్స్ లో ఆసుప‌త్రికి త‌ర‌లించారు... ఈ మంట‌ల్లో యాద‌య్య శ‌రీరానికి  సుమారు 60 శాతం తీవ్రంగా గాయాలు  అవ్వ‌గా, త‌ల్లి యాద‌మ్మ‌కు కూడా స్వ‌ల్పంగా గాయాలు అయ్యాయ‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు..  అయితే వారిని  మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్ గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు డాక్ట‌ర్లు... ఈ దాడిపై జ‌న‌గామ పోలీసులు కేసు స‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.