మొబైల్ కోసం త‌ల అక్క‌డ పెట్టాడు ?

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-03-22 04:01:20

మొబైల్ కోసం త‌ల అక్క‌డ పెట్టాడు ?

ఈ న‌వీన యుగంలో ఒక‌పూట అన్నం లేకున్నా బ్ర‌త‌కగ‌ల‌రు కానీ అర‌క్ష‌ణం మొబైల్ లేకుండా ఉండ‌ట‌మంటే అది ఎవ‌రివల్లా సాథ్యం కాదు.. వ‌స్తువుల‌ను అవ‌స‌రాన్ని బ‌ట్టి వాడుకోవ‌ల‌సిన జ‌నాలు, వాటిపై మునుషుల కంటే అపార‌మైన ప్రేమ‌ను పెంచుకుని చివ‌ర‌కు ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌కున్నారన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు... అయితే ఇలాంటి సంఘ‌ట‌నే తాజాగా లండ‌న్ లో చోటు చేసుకుంది.
 
ఓ వ్య‌క్తి ఖాలీ స‌మ‌యంలో సినిమా చూడ‌డానికి థియేట‌ర్ కు వెళ్లాడు... ఈ వ్య‌క్తి  సినిమా చూస్తున్న స‌మ‌యంలో త‌న మొబైల్ తీసుకుని స‌ర‌దాగా ఏదో ఒక స‌మాచారాన్ని త‌న మొబైల్ ల్లో సెర్చ్ చేసుకుంటుండ‌గా స‌డ‌న్ గా అత‌ని ఫోన్ తాను కూర్చొన్న‌ ముందుసీటు మ‌ధ్య‌లో ప‌డింది... దీంతో ఆ వ్య‌క్తి త‌న మొబైల్ ను తీసుకునే ప్ర‌య‌త్నంలో అత‌ని త‌ల రెండు సీట్ల మ‌ధ్య‌లో ఇరుక్కు పోవ‌డంతో ఎలక్ట్రానిక్‌ ఫుట్‌రెస్ట్ అత‌ని తలపై పడింది.. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన థియేట‌ర్ సిబ్బంది అత‌నిని బ‌య‌ట‌కు తీసేందుకు ఎంతో ప్ర‌త్నించారు.. 
 
చివ‌రికి అత‌ని ప‌రిస్థితి సీరియ‌స్ గా ఉండ‌డంతో సిబ్బంది రెండు సీట్ల‌ను విర‌గ్గొట్టి థియేట‌ర్ సిబ్బంది బ‌య‌ట‌కు తీశారు... అయితే అప్ప‌టికే తీవ్ర‌గాయాలు అయినా ఆ వ్య‌క్తి తాను ఇక చ‌నిపోతాననే  భ‌యానికి గురిచెంది గుండెపోటు తెచ్చుకున్నాడు... దీంతో అత‌ని ప‌రిస్థితి సీరియ‌స్ గా ఉండడంతో ఆయ‌న్ని హుటా హుటిన చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు... కానీ అత‌నికి తీవ్ర గాయాలు కావ‌డంతో కొద్ది రోజుల పాటు చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు... 9న థియేటర్‌లో తల ఇరుక్కుపోగా మార్చి 16న ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు... విధి ఎప్పుడు ఎలా ఎవ‌రిని  డైవ‌ర్ట్ చేస్తుందో ఎవ‌రి లైఫ్ ఎలా ట‌ర్న్ చేస్తుందో చెప్ప‌లేము.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.