ప్రాణం తీసిన మొబైల్ ఫోన్

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

crime
Updated:  2018-10-24 03:58:54

ప్రాణం తీసిన మొబైల్ ఫోన్

ఖ‌మ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎస్టీ వ‌స‌తి గృహంలో 10 త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థి త‌న మిత్రుల‌తో క‌లిసి 4వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థిని హ‌త్య‌చేశాడు. ఖానాపురానికి చెందిన జ్యోష‌ఫ్ గిరిజ‌న పాఠ‌శాల‌లో 4వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అదే హ‌స్ట‌ల్లో ఉంటూ రిక్సా బ‌జార్ లో 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న మ‌రో విద్యార్థితో ఇత‌నికి గొడవ అయింది.
 
ఈ కొడ‌వ కాస్త వీరిద్ద‌రి మ‌ధ్య మాట మాట పెర‌గ‌డంతో పెద్ద‌ది అయింది. దీంతో త‌న మిత్ర‌లను వెంట‌వేసుకుని వ‌చ్చిన టెన్త్ విద్యార్థి జ్యోష‌ఫ్ ను హ‌త్య‌చేశాడు. విద్యార్థి హ‌త్య‌కంటే అత‌నిని చంపేసిన తీరు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ్యోష‌ఫ్ ను ట్రంక్ పెట్ట‌లో కుక్కి ఆపెట్ట‌ల మాద కూర్చోవ‌డంతో అత‌ని మెడ ఎముక విరిగిపోయింది. ఈ కార‌ణంగానే జ్యోష‌ఫ్ ప్రాణం పోయింద‌ని పోలీసులు అనుమానుస్తున్నారు.
 
ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం అయిన 10వ త‌ర‌గ‌తి విద్యార్థి పోలీసులు అదుపులో ఉన్నారు. ఈ గొడ‌వ ఏవిధంగా జ‌రిగింద‌ని అధికారులు ఆరా తీస్తే ఇందుకు కార‌ణం సెల్ ఫోన్ అని తేలింది. టెన్త్ విద్యార్థి జ్యోష‌ఫ్ సెల్ ఫోన్ అడ‌గ‌డ‌మే ఇంత ర‌చ్చ‌కు కార‌ణం అయించ‌ద‌ని పోలీసులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక జ్యోష‌ఫ్ మ‌ర‌ణ‌వార్త విన్న కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. 

షేర్ :

Comments

0 Comment