అందాల భామ దారుణ హ‌త్య‌

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

crime
Updated:  2018-10-16 10:46:25

అందాల భామ దారుణ హ‌త్య‌

వ్యాపార దిగ్గ‌జం అయిన ముంబై న‌గ‌రంలో తాజాగా దారుణ హ‌త్య చోటు చేసుకుంది. న‌గ‌రంలో ప్ర‌ముఖ మోడ‌ల్, త‌న అంద చందాల‌తో సామాజిక మాద్య‌మాల్లో వేలాదిమంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న రాజ‌స్థాన్ భామ మాన‌సి దీక్షిత్ దారుణ హ‌త్య‌కు గురి అయింది. రాజ‌స్థాన్ కుచెందిన దీక్షిత్ ముంబైలో మోడ‌లింగ్ చేస్తు త‌న జీవ‌నం కొనసాగిస్తుంది. 
 
అదే స‌మయంలో న‌గ‌రంలోని ఆంధేరీ ప్రాంతానికి చెందిన స‌య్య‌ద్ అనే డిగ్రీ సెకండియ‌ర్‌ చ‌దువుతున్న‌ యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అప్ప‌టినుంచి వీరిద్ద‌రు క‌లిసిమెల‌సి ఉన్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దుకు కానీ స‌య్య‌ద్, దీక్షిత్ ని అత్యంత పాశ‌వికంగా న‌రికి చంపి మృత‌దేహాన్ని బ్యాగులో కుక్కి మ‌లాద్ ప్రాంతంలో ఉన్న మైండ్ స్పేస్ వ‌ద్ద చెత్త‌లో ప‌డేశాడు. 
 
కొద్దికాలం త‌ర్వాత ఆక్క‌డి నుంచి దుర్వాస‌న వ‌స్తుండ‌టంతో స్థానిక‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్క‌డికివ‌చ్చి మృత‌దేహం దీక్షిత్ గా గుర్తించారు. కేసు న‌మోదు చేసుక‌ని విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు  అక్క‌డే ఉన్న సీసీటీవీ పుటేజ్ ద్వారా ప‌రిశీలించ‌గా ఓ క్యాబ్ లో వ‌చ్చిన స‌య్య‌ద్ మృత‌దేహాన్ని ప‌డేసిన‌ట్లుగా ఇందులో రికార్డ్ అయింది. దీంతో స‌య్య‌ద్ ను పోలీసులు అరెస్ట్ చేసి అత‌నిని రిమాండ్ కు తర‌లించిన‌ట్లు వెల్ల‌డించారు.

షేర్ :

Comments

0 Comment