దారుణం అంద‌రు చూస్తుండ‌గానే గొడ్డ‌లితో న‌రికిన‌ వైనం

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-09-26 01:55:25

దారుణం అంద‌రు చూస్తుండ‌గానే గొడ్డ‌లితో న‌రికిన‌ వైనం

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై దారుణం జ‌రిగింది. అత్తాపూర్ పిల్ల‌ర్ నెంబ‌ర్ 38 ద‌గ్గ‌ర ఓ యువ‌కుడిని న‌లుగురు దుండగులు వేటాడి, వేటాడి గొడ్డ‌లితో న‌రికి హ‌త్య చేశారు. దాడి స‌మ‌యంలో ర‌క్షించాలి అంటూ ఆ యువ‌కుడు ఆర్థ‌నాదాలు పెట్టాడ‌ని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ దాడి చేసిన వారిలో ఇద్ద‌రిని ట్రాఫిక్ పోలీసులు ప‌ట్టుకున్నారు. 
 
చ‌నిపోయిని వ్య‌క్తిని ర‌మేష్ గా గుర్తించారు పోలీసులు.. శంషాబాద్ రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ లో ఓ కేసులో ఏ వ‌న్ నిందితుడు ర‌మేష్.. కాగా ఉప్ప‌ల్ లో హాజ‌రు అవ్వ‌డానికి ర‌మేష్ వ‌స్తుండ‌గా గుర్తు తెలియ‌ని న‌లుగురు వ్య‌క్తులు న‌రికి చంపారు.  రెండు గ్యాంగుల మ‌ధ్య వివాద‌మే ఈ హ‌త్య‌కు కార‌ణం అయి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.