భార్య‌తో అక్ర‌మ‌సంబంధం పెట్టుకుంటే ఏమి శిక్ష‌వేశాడంటే?

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

screct affairs
Updated:  2018-03-24 05:23:52

భార్య‌తో అక్ర‌మ‌సంబంధం పెట్టుకుంటే ఏమి శిక్ష‌వేశాడంటే?

పెద్ద‌ల స‌మ‌క్షంలో మూడు ముళ్లు వేసుకుని ఒక్క‌ట‌య్యారు వ‌ధువు, వ‌రుడు.. పెళ్లి త‌ర్వాత కొంత కాలం పాటు ఎలాంటి  స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా వారి జీవ‌నం సాఫీగా సాగుతున్న స‌మ‌యంలో వారి కుటుంబంలోకి మూడో వ్య‌క్తి చేర‌డంతో వారి కుటుంబంలో మ‌న‌శ్శాంతి క‌రువైంది.. ఆ వివాహిత‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు.. దీంతో ఆమె భ‌ర్త అత‌ని పై క‌క్ష పెంచుకున్నాడు ఈ అక్ర‌మ సంబంధం పై నిప్పులు చెరిగాడు.. చివ‌ర‌కు ఆ కుటుంబంలో అక్ర‌మ సంబంధం పెట్టుకుని త‌న భార్య‌ను వ‌శ‌ప‌రుచుకున్న వ్య‌క్తిపై దాడి చేశాడు ఈ దాడిలో అత‌ని రెండు చేతులు న‌రికేశాడు.
 
ఈ ఘ‌ట‌న గుమ్మ‌ల‌క్ష్మీపురం మండ‌లం కొత్త‌గూడ‌లో చోటు చేసుకుంది.నరేష్‌, సుహాసిని ఇద్ద‌రు బార్య భ‌ర్త‌లు..సుహాసినితో అదే గ్రామానికి చెందిన ధనుంజ‌య్ అనే వ్య‌క్తి.... గ‌త కొద్ది కాలంగా అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు... ఈ విష‌యం భ‌ర్త న‌రేష్ కు తెలియ‌గానే ప‌క్కా ఫ్లాన్ వేసి త‌న స్నేహితుల ద్వారా ధనుంజ‌య్ ను ఊరి చివ‌ర‌కు ర‌ప్పించి అత‌ని చేతుల‌ను నరికేశాడు.
 
అయితే ఈ విషయం గమనించిన గ్రామస్తులు ధనుంజయ్‌ను దగ్గరిలోని భద్రగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత‌ని పరిస్థితి విషమంగా ఉండ‌డంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కింగ్‌ జార్జి ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడికి తరలించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.