భార్య వివాహేత‌ర సంబందం పెట్టుకోవ‌డంతో సాఫ్ట్ వేర్ భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

crime
Updated:  2018-10-30 01:09:12

భార్య వివాహేత‌ర సంబందం పెట్టుకోవ‌డంతో సాఫ్ట్ వేర్ భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ లో తాజాగా మ‌రో దారుణం చోటుచేసుకుంది. భార్య‌ప్ర‌వ‌ర్త‌న త‌ట్టుకోలేక ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. హైద‌రాబాద్ లోని పంజాగుట్టా ప్ర‌తాప్ న‌గ‌ర్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌శాంత్, పావ‌ని ఇద్ద‌రూ ఒక‌రి నొక‌రుకు ఇష్ట‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో పెద్ద‌ల‌ను ఒప్పించి గ‌తంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్ర‌శాంతంగా సాగుతున్న వీరి కాపురంలో మూడో వ్య‌క్తి ప్ర‌వేసించాడు.
 
దీంతో కాపురం కాస్త క‌ల‌హాల‌ కాపురంగా మారింది. ప్ర‌శాంత్ ను కాద‌ని ప్ర‌ణ‌య్ అనే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది పావ‌ని. దీంతో మ‌న‌స్థాపానికి చెందిన ప్ర‌శాంత్ అనేక సార్లు మెను హెచ్చ‌రించాడు, కానీ పావ‌ని మాత్రం త‌న ప్ర‌వ‌ర్త‌న మార్చుకోలేదు. పైగా అనేక సంద‌ర్భ‌ల్లో ప్ర‌శాంత్ ను చ‌చ్చిపోవాల‌ని శాపనార్థాలు పెట్టింది. దీంతో మానసిన క్షోభ భ‌రించ‌ని ప్ర‌శాంత్ చివ‌ర‌కు త‌న ఫ్లాట్ లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. 
 
సూసైడ్ నోట్ లో త‌న చావుకు కార‌ణం త‌న భార్య పావ‌నినే అంటూ లేఖ‌లో పేర్కొన్నాడు. తాను అవ‌మానం భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య‌చేసుకుంటున్నాని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.. మ‌రో వైపు కుమారుడు మ‌ర‌ణ వార్త తెలియ‌గానే త‌ల్లిదండ్ర‌లు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

షేర్ :

Comments

0 Comment