ఫేస్ బుక్ నుంచి క‌త్తిపోటు వ‌ర‌కూ స‌స్పెన్స్

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-01-27 03:52:58

ఫేస్ బుక్ నుంచి క‌త్తిపోటు వ‌ర‌కూ స‌స్పెన్స్

ఈ న‌వీన యుగంలో ఎటు చూసినా సాంకేతిక మాధ్య‌మాలు విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో మోసాల‌కు అడ్డు అదుపు లేకుండా పోతోంది... ఇటు అబ్బాయిలు, అమ్మాయిల‌ను టార్గెట్ చేసుకుంటూ, అటు అమ్మాయిలు అబ్బాయిల‌ను టార్గెట్ చేసుకుంటూ, ఒక‌రిపై ఒక‌రు మోస‌పూరిత‌మైన మాట‌లు చెప్పుకుంటున్నారు... ఈలోపు త‌మ‌ను మోసం చేశార‌న్న విషయం తెలుసుకునేలోపు హ‌త్య‌లు, ఆత్మహ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు.

అయితే ఇలాంటి సంఘ‌ట‌న చెన్నైలో చోటు చేసుకోవ‌డంతో న‌గ‌ర‌మంతా క‌ల‌క‌లం రేపుతోంది... ఎన్నూర్ పోలీస్ స్టేష‌న్ లో కానిస్టేబుల్ గా క‌ణ్ణ‌న్ కుమార్ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రిస్తున్నారు... కొద్ది రోజుల క్రితం ఇత‌నికి సోష‌ల్ మీడియా ఫేస్ బుక్ లో ఒక అమ్మాయితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది... అయితే ఈ ప‌రిచ‌యం కాస్త కొంత కాలానికి ప్రేమ‌గా మార్చుకున్నారు... తనే స‌ర్వ‌స్వం అని భావించిన క‌ణ్ణ‌న్ కొద్ది రోజుల క్రితం త‌న ద‌గ్గ‌రున్న‌దంతా ఊడ్చిచ్చాడు ఆ యువ‌తికి... ఈ నేప‌థ్యంలో ఒక‌రినొకరు క‌లుసుకునేందుకు య‌త్నించ‌గా ఫేస్ బుక్ ప్రేయ‌సి నిరాక‌రించింది.

దీంతో క‌ణ్ణ‌న్ కుమార్ త‌న పోలీస్ బ్రెయిన్ కు ప‌దును పెట్టి పూర్తి వివ‌రాలు ఆరాతీస్తే... త‌న‌ను ప్రేమించిన‌ది అమ్మాయి కాద‌ని అబ్బాయని అత‌ని పేరు అయ్య‌నార్ అని తేలింది... దీంతో ఎలాగైనా త‌న‌కు జ‌రిగిన అవ‌మానానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నే ఉద్దేశ్యంతో క‌ణ్ణ‌న్ త‌న స్నేహితుల ద్వారా అయ్య‌నార్ ను బ‌య‌టికి ర‌ప్పించి అతి కిరాత‌కంగా న‌రికి చంపాడు.

అయ్యనార్ హత్యకేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. విజయ్‌కుమార్‌, తజింగ్‌, తమిళరసన్‌ అనే ముగ్గురు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విచార‌ణ‌లో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అస‌లు విషయం బ‌య‌టపెట్టారు. స్నేహితుడైన కణ్ణన్‌ కోసమే అయ్యనార్‌ను హత్యచేశామని ఒప్పుకున్నారు. అయితే ఈహ‌త్య‌కేసుతో ప్ర‌థ‌మ నిందితుడు కానిస్టేబుల్ క‌ణ్ణ‌న్ ప‌రారిలో ఉన్నాడ‌ని పోలీసులు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.