టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్తె ఆత్మహత్య

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-02-19 03:10:41

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్తె ఆత్మహత్య

ఉన్న‌త చ‌దువులు చ‌దువుకోవ‌డానికి, ఉద్యోగ రిత్యా చాలామంది యువ‌తీ - యువ‌కులు మారుమూల ప్రాంతాల నుంచి హైద‌రాబాద్ కు త‌ర‌లివ‌స్తుంటారు... వారి త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌లు దూర ప్రాంతాల‌లో చ‌దువు  కుంటున్నార‌నే ఉద్దేశ్యంతో, వారికి  ఏ లోటు రాకుండా అడిగినవి అన్నీ పంపిస్తుంటారు పేరేంట్స్...అలా పంపించినా కూడా కార‌ణం లేకుండా కోంత మంది ఆత్మ హ‌త్య చేసుకుంటుంటారు.
 
అయితే ఇలాంటి సంఘ‌ట‌నే మ‌రోసారి హైద‌రాబాద్ లో చోటు చేసుకుంది... ఉన్న‌త చ‌దువు కోసం న‌గ‌రానికి వ‌చ్చిన హనీషా చౌద‌రి అనే యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది...  పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ... అనంత‌పురం జిల్లా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుగ్గయ్యచౌదరి కుమార్తె హ‌నీషా న‌గ‌రంలోని కొంప‌ల్లిలో ఎంబీఏ రెండ‌వ సంవ‌త్స‌రం చ‌దువుతోంది... మ‌హిళా హాస్ట‌ల్ గ‌దిలో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసుకుని, హనిషా  గ‌దిలో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుంది.
 
అయితే చివ‌ర‌గా హ‌నీషా త‌న బాయ్ ఫ్రెండ్ తో వీడియోకాల్  మాట్లాడిన‌ట్లు పోలీసులు తెలిపారు... ఈ వీడియో కాల్ లో త‌న ప్రియుడు చూస్తుండ‌గానే గ‌దిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది... ఈ విష‌యాన్ని చూస్తున్న త‌న ప్రియుడు ప‌టేల్ హుటా హుటిన హనీషా హాస్ట‌ల్ కు చేరుకుని ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
 
హ‌నీషా ఆసుప‌త్రికి చేరేలోపే ప్రాణాలు వ‌దిలింది.. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.. మృత‌దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు... హ‌నీషా ఆత్మ హ‌త్య‌పై త‌న రూమ్ మేట్స్  ని విచారించినా, త‌ల్లిదండ్రుల‌ను విచారించినా, నోరు మెద‌ప‌డం లేద‌ని, పోలీసులు చెబుతున్నారు....అయితే  త్వ‌ర‌లో హనీషా ఆత్మ హ‌త్య‌కు సంబంధించి వివ‌రాలు తెలియచేస్తామ‌ని పోలీసులు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.