రాత్రయితే చాలు కొంచెం కొంచెం భర్త రక్తం తాగుతున్నభార్య

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

cirme
Updated:  2018-07-23 06:10:04

రాత్రయితే చాలు కొంచెం కొంచెం భర్త రక్తం తాగుతున్నభార్య

మ‌న దేశంలో రోజు ఎదో ఒక క్రిమిన‌ల్ వార్త బ‌య‌ట‌ప‌డుతూనే ఉంటుంది. పిల్ల‌ల త‌ల‌ను న‌రక‌డం నుంచి ప్రియుడి కోసం భర్తను హతమార్చడం వరకు చాలానే జరుగుతున్నాయి. చేత‌బ‌డి పేరిట ఎన్నో ఆకృత్యాలు చేస్తుంటారు. ఈ వార్త‌లో ఒక యువ‌తి త‌న భ‌ర్త ర‌క్తాన్ని ప్ర‌తి రాత్రి తాగేది. వింటేనే వెన్నులో వ‌ణుకు పుడుతోంది కదా! చేత‌బ‌డిలో భాగంగా ఇది చాలా స‌ర్వ‌సాధార‌ణంగా చేసే ప‌ని అని కొంద‌రు చెబుతారు.
 
భ‌ర్త ర‌క్తం తాగే యువ‌తిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆమె బెంగాల్‌లోని బిర్బ‌మ్ జిల్లా స‌రైపూర్‌కు చెందింది. ఆమెకు ర‌క్తం అంటే ఎంతో ఇష్టం. రోజు రాత్రి త‌న భ‌ర్త నోట్లోంచి కొద్దికొద్దిగా ర‌క్తం తాగుతూ ఉండేది. ఈ అల‌వాటును ఆమె ఒక పున్న‌మి రాత్రి ప్రారంభించిందని చెబుతున్నారు. ఆమె త‌న భ‌ర్త పెదాల‌ను ర‌క్తం కోసం కొరికేట‌ప్పుడు ప‌క్క‌నే త్రిశూలాన్ని ఉంచుకునేదని చెప్తారు. ఆమె అత్త‌గారు తెలిపిన ప్ర‌కారం ఆ యువ‌తి రోజు భ‌ర్త చాతీపై కూర్చొని నోట్లోంచి ర‌క్తాన్ని తాగేదని ఆమె అత్తగారి వాదన.
 
ఆ యువ‌తి ప్ర‌వర్త‌న చాలా విచిత్రంగా ఉండేద‌ని ఇరుగుపొరుగు వారు అంటుండేవారు. ఆమెను మంత్ర‌గత్తెగా కూడా అభివ‌ర్ణించేవారు. భ‌ర్త అకాల మ‌ర‌ణానికి ఆమె కార‌ణ‌మ‌ని గ్రామ‌స్థులు అనుమానం వ్య‌క్తంచేశారు. యువ‌తికి ఉన్న ఈ అల‌వాటు వ‌ల్లే భ‌ర్త చ‌నిపోయాడ‌ని చెబుతున్నా డాక్ట‌ర్లు మాత్రం రోగికి అనీమియా వ్యాధి వ‌ల్లే చ‌నిపోయాడ‌ని చెబుతున్నారు. అత‌డు చ‌నిపోవ‌డం వ‌ల్లే భార్య‌పై అన‌వ‌స‌ర నింద‌లు వేసి ఉండొచ్చ‌ని డాక్ట‌ర్ల వాద‌న‌.
 
ఆమె అత్త‌గారు చేసిన వాద‌న‌ల‌కు ఎలాంటి ఆధారాలు క‌నిపించ‌లేదు. పైగా ఆమె చేత‌బ‌డి చేస్తున్న‌ట్టుగా ఆన‌వాళ్లేమీ క‌నిపించ‌లేదు. యువ‌తి త‌ల్లిదండ్రులు ఇదంతా త‌మ బిడ్డ‌పై నింద వేయ‌డానికే అని వాపోతున్నారు. ఆమె భర్త అనీమియా  వ్యాధితో చనిపోయాడని డాక్టర్లు చెబుతున్నారు.  ఆయనకు రక్తం తక్కువగా ఉండడంవల్లే చనిపోయారని వైద్యులు చెబుతున్నారు. గ్రామస్తులు ఒకటి ఫిక్స్ అయితే ఎవరు ఏమి చెప్పిన వారు నమ్మరని చివరకు భగవంతుడు వచ్చి చెప్పినా వినరన్న సంగతి తెలిసిందేగా.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.