పొగరాయుళ్లు ఇది పాటించ‌కపోతో అంతే సంగ‌తులు.

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-01-30 04:21:07

పొగరాయుళ్లు ఇది పాటించ‌కపోతో అంతే సంగ‌తులు.

ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుంచి రాత్రి ప‌డుకునేంత వ‌ర‌కూ ప్ర‌తీ రోజూ పొగ రాయుళ్లు సుమారు ప‌ది సిగ‌రెట్స్ కు పైబ‌డి తాగుతుంటారు...అయితే కోంత‌మంది సిగ‌రెట్స్ వాడుకలో ఈ ప‌ది సిగ‌రెట్స్ అన్న‌ది చాలా చిన్న‌మాట కావ‌చ్చు... ఎందుకంటే ఇలాంటి వారు ప్ర‌తీ పూట‌కు ప‌ది సిగ‌రెట్ల‌కు పైబ‌డే పొగ‌ను కాల్చుతూ ఉంటారు...అందులో ఎక్కువ శాతం ఆలోచ‌న కోసం పొగ తాగితే, మ‌రికోంత టైమ్ పాస్ కోసం అలాగే మ‌రికొంద‌రు స్నేహితుల‌తో క‌ల‌సి ప్ర‌తీ రోజు టీ స్టాల్ ద‌గ్గ‌ర సిగ‌రెట్స్ తాగుతుంటారు... అలా ఏదో ఒక సాకుతో ప్ర‌తీ రోజు అధిక మోతాదులో పోగ‌ను పీల్చుతుంటారు.

అయితే నేటి స‌మాజంలో సాంకేతిక మాధ్య‌మాలు విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో, వాటి ప్ర‌భావం మ‌హిళ‌ల‌పైన కూడా పడుతోంది.. దీనిలో పురుషుల‌కు స‌మానంగా కొంత మంది మ‌హిళ‌లు ధూమ‌పానాన్ని చేస్తున్నారు... అలాంటి వారికి తాజా అధ్యయ‌నం ప్ర‌కారం అధ్యాప‌కులు చేప్పిన‌ది పాటించ‌కపోతే ప్రాణానికే ప్ర‌మాదం అని చెబుతున్నారు.

ఒక సిగరెట్‌ తాగినా కూడా గుండె జబ్బులు, స్ట్రోక్‌ రిస్క్‌ 50 శాతం పెరుగుతుందని, రోజుకు 20 సిగరెట్లు తాగే వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు రెండింత‌లు ఎక్కువ అవుతోంద‌ని, ఒత్తిడి ప్ర‌భావం 100 శాతం పెరుగుతోంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇందులో మహిళలు ప్ర‌తీ రోజూ కేవ‌లం ఒక సిగరెట్‌ తాగినా కూడా, వారికి గుండె జబ్బు రిస్క్‌ రెండు రెట్లు అధిక‌మ‌వుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు... రోజూ ఒక సారి ద‌మ్ము కొడితే ఏం కాదులే అనుకునే వారు కోకొల్ల‌లు. అలాంటి వారు కూడా పూర్తి స్థాయిలో పొగ‌ను తాగ‌డం మాన‌క పోతే, ప్రాణాంత‌క‌రమైన‌ రోగాలు వ‌స్తాయ‌ని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.