దీపారాధ‌న కొండెక్కితే దేనికి సంకేతం?

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

Updated:  2018-01-23 04:31:01

దీపారాధ‌న కొండెక్కితే దేనికి సంకేతం?

హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం దీపానికి ఎంతో ప్రాముఖ్య‌త ఇస్తాం పూజ‌ల‌లో.. మ‌రీ ముఖ్యంగా యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు సమిధలతో ఆహుతులు సమర్పిస్తాం... ఆ స‌మ‌యంలో  అక్కడ జ్వాల పెరిగితే పాలు కలిపిన నీళ్లు చిలకరించి నియంత్రిస్తారు పూజారులు. ఆకాశం నుంచి వాయువు.. వాయువు నుంచి అగ్ని.. అగ్ని నుంచి నీరు.. నీటి నుంచి భూమి..భూమిపైన ఓషధుల సాయంతో అన్నరూపంగా ఉన్న ఈ పంచతత్వాలను స్వీకరించి మనిషి ఏర్పడ్డాడు అని చెబుతారు.
 
అగ్ని పెరగడానికి గాలి సాయంచేస్తుంది.. అలాగే అగ్ని చిన్నదిగా ఉంటే అదే గాలి దాన్ని ఆర్పివేస్తుంది...  అందుకే మనలోని జ్ఞానాగ్నికి దీపం ప్రతీకగా చెబుతారు... అది నిరంతరం వెలుగుతూనే ఉండాలి. అందుకే దీపం ఆరిపోతే అపశకునం అని చెబుతారు పెద్ద‌లు.
 
 అందుకే ఎక్క‌డైనా గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనుకోకూడదు అనే విష‌యాన్నిపెద్దవాళ్లు ప‌దే ప‌దే  చెబుతు ఉంటారు. దాన్ని రక్షించుకోవడం కూడా మన బాధ్యతే అనేది ఆ సూచ‌న‌... అయితే అనుకోకుండా జరిగే వాటిని ఎవరూ ఆపలేరు. ఒకవేళ పూజలో దీపారాధన గాలికి కొండెక్కితే.. నూనె, ఒత్తులు మార్చి మళ్లీ వెలిగించుకోవచ్చు. తప్పేం లేదు. అది అపశకునం కూడా కాదు... పూజ స‌మ‌యంలో దీపం కొండెక్కితే ఒత్తులు మార్చి నూనె వేసి వెలిగించుకోవ‌చ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.