ఆలయ గోపురాలు ఎందుకు ఎత్తు నిర్మిస్తారు?

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

Updated:  2018-01-20 10:02:05

ఆలయ గోపురాలు ఎందుకు ఎత్తు నిర్మిస్తారు?

దేవాలయం అంటే ల‌క్షోప‌ల‌క్ష‌ల భ‌క్తుల పుణ్య‌దామం.. ఆగ‌మ శాస్త్ర బ‌ద్దంగా దేవాల‌యాల‌ను నిర్మించ‌వ‌ల‌సి ఉంటుంది. ఆల‌య నిర్మాణం.. దేవుడు ప‌డుకున్న‌ట్లు శ‌య‌న రీతిలో నిర్మిస్తారు. ఆల‌య గొపుర‌మే బ‌గ‌వంతుని పాదాలు, గ‌ర్భగుడి.. భ‌గ‌వంతుని శిర‌స్సు ఆల‌య మంట‌పం.. భ‌గవంతుని క‌డుపు దైవ‌ద‌ర్శ‌నం..అంటే గుడిలోకి వెళ్లి స్వామిని చూసి గంట కొట్టి న‌మ‌స్క‌రించాలి అని అనుకుంటూ ఉంటాం. ఆ ప‌ద్ద‌తినే పాటిస్తూ ఉంటాం..

దూరంగా ఉండి కూడా ఆల‌య గోపురానికి న‌మ‌స్క‌రించినా స్వామి పాదాల‌కు న‌మ‌స్క‌రించిన‌ట్లే అవుతుంది..కాబ‌ట్టి ఆలయ గోపురం ఎత్తుగా ఉంటుంది.. అంతే కాకుండా స‌ర్వ జ‌నానికి, పొరుగు ఊరి వారికి ప‌ర‌దేశ వాసుల‌కు, కొత్త‌గా వ‌చ్చిన వారికి దేవాల‌యం ఎక్క‌డ ఉందో తెలుసుకోవ‌డానికి సుల‌భంగా ఉంటుంది..

దేవుడు గొప్ప‌వాడు, ఉన్న‌త‌మైన వాడు, అంద‌ని వాడు, అంద‌రివాడు. అని చెప్ప‌డం కోసం ఆల‌య గోపురం ఎత్తుగా నిర్మిస్తారు..

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.