అస‌లు RIP అని కామెంట్ పెట్టొచ్చా?

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

RIP
Updated:  2018-07-13 05:40:38

అస‌లు RIP అని కామెంట్ పెట్టొచ్చా?

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఎవ‌రైనా మ‌ర‌ణించారు అనే వార్త రాగానే,  వెంటనే రిప్ అని కామెంట్ పెడ‌తాం.. అస‌లు ఆ ప‌దం వాడ‌వ‌చ్చా లేదా అనేది కూడా తెలియ‌కుండా, కొంద‌రు ఆ కామెంట్ పెడ‌తారు.. అస‌లు దాని అర్ధం తెలుసుకుందాం అని కూడా చాలా మంది ఆలోచించ‌రు.. అస‌లు మ‌న‌కు ఆ కామెంట్ ఎందుకు పెడుతున్నామో తెలియకుండానే అంద‌రిలా కామెంట్ పెడుతూ ఉంటాం.
 
రిప్ అనే ప‌దానికి అర్దం ఏమిటంటే? Rest in peace అని అర్థం. క్రైస్తవం ప్రకారం ఒక మనిషి మరణించాక, అతని ఆత్మ జడ్జిమెంట్ డే వరకు ఈ భూమిపైనే నిరీక్షించాలి. ఇస్లాం ప్రకారం కూడా చనిపోయిన వారి ఆత్మ ఒక రోజు వరకు నిరీక్షించాలి... అలా భూమిపైనే నిలిచిన ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని  ఈ RIP అర్దం. ఇది చాలా కొంత‌మందికి మాత్ర‌మే తెలిసిన వాస్త‌వం.
 
మరి సనాతన ధర్మం ప్రకారం ఆత్మ అనేది నాశనం లేనిది. ఆత్మకు అలసటే ఉండదు. అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? అలాగే మరణానంతరం జీవి పాపపుణ్యాల్ని బట్టి, తరువాతి జన్మ పొందడమో, స్వర్గ నరకాలకు వెళ్ళడమో లేక మోక్షానికి వెళ్ళడమో లాంటి ప్రతి చర్యలుంటాయి. మోక్షం వరకూ ఇది ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. అంతేకానీ మనం ఏ రోజు గురించి నిరీక్షించాల్సిన అవసరం లేదు.
 
RIP అనేది పూర్తిగా పాశ్చాత్యమే కాక, మతాంతరం కూడా. మరణించిన వ్యక్తికి ముక్తి కలగాలనో, లేక స్వర్గస్తుడవ్వాలనో, శాశ్వత పుణ్య లోకాలు కలగాలనో మనం ప్రార్థించాలే తప్ప, RIP అని ప్రార్థించడం సనాతన ధర్మానికి వ్యతిరేకమని గుర్తించాలి. స్వ‌ర్గ ప్రాప్తిర‌స్తు అనుకోవాలి గాని, ఇలా RIP పెట్ట‌కూడ‌ద‌ట‌. ఇక ఇప్పటినుండి అయినా తొందరపడి అలా కామెంట్ పెట్టకండి. మీరు తెలియ‌ని వారికి తెలియ‌చేయండి.. రిప్ అనే కామెంట్ క‌న్నా వారి ఆత్మ‌కు సంతృప్తి క‌ల‌గాలి అనే కామెంట్ పెట్ట‌డం మంచిది.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.