ఉదయం నిద్ర లేవగానే ఏ వస్తువులు చూడవచ్చు, ఏ వస్తువులు చూడకూడదు?

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

mobile
Updated:  2018-07-21 15:19:10

ఉదయం నిద్ర లేవగానే ఏ వస్తువులు చూడవచ్చు, ఏ వస్తువులు చూడకూడదు?

ఈ న‌వీన యుగంలో అంతా టెక్నాల‌జీ మ‌యం అయింది. అయితే గ‌తంలో ఖాళీ స‌మ‌యంలో న‌లుగురు కూర్చిని క‌బుర్లు చెప్పుకునే వారు, కానీ ఇప్పుడు మాత్రం సెల‌ఫోన్ తో క‌బుర్లు చెప్పుకుంటున్నారు అంద‌రూ.. అయితే చాలా మంది గ‌తంలో నిద్ర‌లేవ‌గానే ముందు అమ్మ‌నాన్న, లేదా పెద్ద‌ల ముఖం చూసేవారు.... లేదా ఇంట్లో దేవుని ప్ర‌తిమ‌ల‌కు న‌మ‌స్కారం చేసుకునే వారు.. కాని ఇప్పుడు ముందు సెల్ ఫోన్ ప‌క్క‌న ఉందా లేదా అనేది చూసుకుంటున్నారు.
 
అయితే మనం ఏ టెక్నాల‌జీని న‌మ్ముకున్నామో అదే టెక్నాల‌జీ  మ‌న‌ల్ని ముంచేస్తోంది..సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, ట్యాబ్స్, కంప్యూట‌ర్లు అన్ని మ‌న జీవితంలో ఓభాగం అయిపోతున్నాయి.. ఎక్క‌డికైనా వెళ్లిన స‌మ‌యంలో మ‌న ప‌క్క‌న వారు ఉన్నారో లేదో కూడా మ‌ర్చిపోయి సెల్ ఫోన్ ఉందో లేదో చూసుకుంటాం.
 
ఇక మ‌నం నిద్రలేచినప్పటి నుంచీ, పడుకునే వరకూ స్మార్ట్ ఫోన్స్ తో గడిపే వారి సంఖ్య చాలా అధికంగా ఉంది అనే చెప్పాలి..నిద్రలేవగానే సెల్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే…కాని ఇటువంటి అల‌వాటు మంచిది కాదు అని డాక్ట‌ర్లు చెబుతున్నారు.
 
నిద్ర‌లేవ‌గానే సెల్ ఫోన్ చూడ‌టం వ‌ల్ల మ‌న‌కు చాలా అన‌ర్దాలు, మ‌న ఆరోగ్యానికి దుష్ఫ‌లితాలు క‌లుగుతాయ‌ట‌.. ఇలా చూడ‌టం వ‌ల్ల  కంటికి చాలా చేటు అంటున్నారు వైద్యులు....మెసేజ్ లు ,ఈ మెయిల్స్ చూడటం వలన సమయం తెలియదు..అసలు పని పూర్తికాక  ఈ పని ఒత్తిడి  పెరిగిపోతుంది.అనేక రకాలైన హుద్రోగా సమస్యలు వస్తుంటాయి.. అలాగే అనేక ర‌కాల కంటి సమస్యలు వ‌స్తాయి అని హెచ్చ‌రిస్తున్నారు వైద్యులు.
 
ఉదయం లేవగానే కొంచెం సేపు వ్యాయామం చేయాలి....అలాగే మనసు ప్రశాంతం గా ఉండటానికి పచ్చని మొక్కల మధ్య కుర్చుంటే, హాయిగా ఉండి శరీరం చురుకుకా ప‌నిచేస్తుంది...అంతేకాదు మీరు పనిచేస్తూనే మంచి సంగీతాన్ని వినడం వలన, చాలా రిలీఫ్ ఉంటుంది అని చెప్తున్నారు వైద్యులు. నిద్ర లేవగానే వెంటనే కాళ్ళు - చేతులు సాగదీసి స్ట్రెచింగ్‌ వ్యాయామాలు..చేస్తే శరీరం ఇంకా ఉత్సాహంగా మారుతుంది. ఇక నిద్ర‌లేవ‌గానే సెల్ ఫోన్ కాకుండా డాక్ట‌ర్లు చెప్పేప‌ని చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది... మీ జీవితంలో ఎటువంటి స‌మ‌స్య‌లు సెల్ ఫోన్ వ‌ల్ల రాకుండా ఉంటాయి.
 
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.