మీ ఆయుష్షును పెంచుకోవాలంటే గరుడ పురాణంలో చెప్పిన ఈ సూచనలను పాటించండి

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

garuda puranam
Updated:  2018-08-20 10:40:09

మీ ఆయుష్షును పెంచుకోవాలంటే గరుడ పురాణంలో చెప్పిన ఈ సూచనలను పాటించండి

ప్రతీ మనిషి ఏదో ఒకరోజు చనిపోవలసిందే. దానిని ఎవరూ ఆపలేరు. కాని మనిషి జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. అవును మీరు విన్నది నిజమే. గరుడపురాణం ప్రకారం మనిషి తన జీవిత కాలాన్ని పెంచుకునేందుకు అనుసరించాల్సిన ప్రకృతి ధర్మాలు, నియమాలకు సంబంధించిన రహస్యాలను తెలుసుకోవచ్చు. కొన్ని నియమాలను పాటించడం వలన మన ఆయుష్షుని ఇంకొంతకాలం పెంచుకోవచ్చునని వెల్లడించింది. మనకి ఈ సూత్రాలను మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కానీ, చాలా మంది వాటిని పాటించరు. ఈరోజు మనం వాటిని తెలుసుకుని పాటించి, ఆయుష్షుని పెంచుకుందాం.
 
గరుడపురాణం ప్రకారం మన జీవిత కాలాన్ని పెంచే సూచనలు ఇవే…
 
1.రాత్రిపూట భోజనంలో పెరుగు తినకూడదట. రాత్రిపూట పెరుగు తినడం వలన అనారోగ్య సమస్యలు వచ్చి, జీవిత కాలం తగ్గిపోతుంది.
 
2.రాత్రిపూట తినగానే కొందరు నిద్రపోతారు. అలా చేయకూడదు. రాత్రి తినగానే పడుకుంటే, సరిగ్గా జీర్ణం కాక అనారోగ్య సమస్యలు వచ్చి జీవితకాలం తగ్గుతుంది.
 
3. రాత్రి పూట మాంసాహారం తినరాదు. తింటే అది సరిగ్గా జీర్ణం కాక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. దీంతో అనారోగ్యం కారణంగా మనిషి ఆయుర్దాయం తగ్గుతుంది. త్వరగా చనిపోతాడు. కనుక రాత్రి పూట మాంసాహారం మానేస్తే జీవిత కాలాన్ని, ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు.
 
4.అలాగే భార్యా భర్తలు శృంగారం రాత్రివేళ మాత్రమె చెయ్యాలి. పగలు చేయడం వలన ఆయుష్షు తగ్గుతుంది. ఎందుకంటే పగటి వేళ జీవన గమనానికి, భవిష్యత్తుకి కష్టపడి పనిచేసి ధనాన్ని అర్జించాల్సిన కార్యం ఉంటుంది. దానిని నిర్లక్ష్యం చేసి దాంపత్య జీవితం వైపు మనసు మళ్లితే వారి కుటుంబ మనుగడ కష్టమవుతుందని పెట్టిన నియమం ఇది.
 
6. శ్మశానాల్లో దహన కార్యక్రమాలను నిర్వహించగానే వెంటనే ఇంటికి చేరుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉండే బాక్టీరియాలు మన శరీరాల్లోకి వెళితే అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. వాటి వల్ల మనం త్వరగా చనిపోవాల్సి వస్తుంది. దీంతో జీవిత కాలం తగ్గుతుంది. కనుక ఎవరైనా ఎక్కువ కాలం జీవించాలంటే.. శ్మశానాల్లో దహన కార్యక్రమాలు ముగియగానే వెంటనే ఇంటికి వెళ్ళాలి.
 
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.