భారతీయ న‌మ‌స్కారం వెనుక ఉన్న రీజ‌న్ ఏమిటంటే..?

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

indian namaskar
Updated:  2018-09-28 05:40:37

భారతీయ న‌మ‌స్కారం వెనుక ఉన్న రీజ‌న్ ఏమిటంటే..?

మ‌న కంటే పెద్ద‌వారిని మ‌నం క‌లిసిన స‌మ‌యంలో వారికి న‌మ‌స్కారం పెడ‌తాం... దానికి వారు కూడా ప్ర‌తిన‌మస్కారం పెడ‌తారు.. అందుకే న‌మ‌స్కారానికి ప్ర‌తిన‌మ‌స్కారం సంస్కారం అంటారు... అలాగే పెద్ద‌లు గౌర‌వం ఇచ్చి పుచ్చుకుంటారు.. మ‌నం పెద్ద‌ల‌కు రెండు చేతులు జోడించి న‌మ‌స్కారం పెట్ట‌డంలో ఉన్న తాత్ప‌ర్యం ఏమిటి అనేది పండితులు చెప్పేది ఇప్పుడు తెలుసుకుందాం...
 
చేతులు జోడించినపుడు రెండు అరచేతులూ కలిపినపుడు పదివేళ్ళూ కలుసుకుంటాయి కదా...ఇవి ఐదు ఙ్ఞానేంద్రియాలకు ఐదుకర్మేంద్రియాలకూ సంకేతం అని చెబుతున్నారు... ఈ పదివేళ్ళనూ కలపడం అంటే ఙ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నింటినీ దైవంవైపు మరల్చి శరణాగత భావంతో అర్పణ చేయటం అని అర్ధం.
 
నాది అనేది ఏమీలేదు. అంతా నీదే స్వీకరించు పరమాత్మా అనే అర్పణ భావనను కలిగి ఉండటం. అవ‌త‌ల వారిని మ‌నం నమస్కరించే సమయంలో మన చేతులకున్న పది వేళ్లు ఒకదానికి మరొకటి తాకడం వల్ల మన శరీరంలోని కళ్లు, చెవులు, మెదడు వంటి అవయవాలలో చైతన్యం కలుగుతుంది. దీనివల్ల ఎదుటివ్యక్తిని చిరకాలం గుర్తుంచుకోవచ్చనే నమ్మకం ఉంది.
 
నమస్కారం చేయడం వల్ల గుండె భాగంలో ఉండే చక్రం తెరుచుకుంటుంది. ఎదుటి మనిషి కూడా మనకు నమస్కరించినపుడు ఒకరికొకరు తమ ఆత్మ శక్తి ద్వారా అనుసంధానించబడతారు. కేవలం మాటలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కాకుండా ఆత్మానుసంధానమైన వారధి నిర్మించుకోవడానికి ఈ నమస్కారం దోహదం చేస్తుంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.