చనిపోయే ఆఖరి క్షణంలో ఏం జరుగుతుంది..?

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

soul
Updated:  2018-06-14 10:49:27

చనిపోయే ఆఖరి క్షణంలో ఏం జరుగుతుంది..?

చనిపోయే ఆఖరి క్షణంలో ఏం జరుగుతుంది..?
 
చ‌నిపోయే ఆఖ‌రి క్షణాల్లో ఏం జ‌రుగుతుంది... మ‌నిషి చ‌నిపోయిన త‌ర్వాత  ఏమౌతాడు....స్వ‌ర్గానికి వెళ‌తారా........న‌ర‌కానికి వెళ‌తారా....స్వ‌ర్గంలో ఏం జ‌రుగుతుంది.... న‌ర‌కంలో ఏం జరుగుతుంది........ ఆత్మ య‌మలోకానికి ఎలా వెళ్తుంది......ఆత్మ మ‌ళ్లీ తిరిగి వ‌స్తుందా...ఒక‌వేళ వ‌స్తే ఎక్క‌డ తిరుగుతుంది....వీట‌న్నింటికి  మ‌న పురాణాలు ఏమ్ చెబుతున్నాయ్..  అస‌లు గ‌రుడ పురాణం ఏం చెబుతుందో.....ఇప్పుడు చూద్దాం. 
 
చనిపోయే ఆఖరి క్షణంలో  ఏం జ‌రుగుతుందన్న విష‌యంపై గ‌రుడ పురాణం ఏం చెప్పింది.....
 
మ‌నిషి చనిపోయే ఆఖరి క్షణంలో ఎలా ఉంటుంది....చ‌నిపోతున్నామ‌ని మ‌న‌కు కొన్ని ఘ‌డియ‌ల ముందే తెలిసిపోతుందా....:య‌మ రాజు పంపిన య‌మ‌భ‌టులు ముందే క‌నిపిస్తారా.....దీని గురించి గ‌రుడ‌ పురాణం ఏం చెబుతుందో చూద్దాం..
 
చ‌నిపోయే ముందు మ‌నిషికి స‌రిగా మాటలు రావు. చావుకి ద‌గ్గ‌ర‌వుతున్న‌పుడు  ఆ వ్యక్తికి మాట్లాడాలని ఉన్నా.. ఏం మాట్లాడలేకపోతాడు. శరీరమంతా  స్పర్శ నాశనం అయి ఎలాంటి చలనం లేకుండా.. గట్టిగా మారిపోతుంది. దివ్యదృష్టి తెరుచుకుని చుట్టు జ‌రుగుతున్న ప్ర‌తి విష‌యాన్ని అర్థం చేసుకోగలుగుతారట.ఇంకో క్ష‌ణంలో తాను చ‌నిపోతున్నా అని తెలియ‌గానే త‌న క‌ళ్ల ముందు య‌మ‌రాజు పంపిన య‌మ‌భ‌టులు క‌నిపిస్తారంటా. భ‌య‌క‌ర‌మైన రూపంలో క‌నిపించే యమధూతలను చూడ‌గానే నోరు త‌డారిపోతుంది.
 
చ‌నిపోయాక య‌మ‌లోకానికి  ఆత్మ ప్ర‌యాణంఎలా ఉంటుంది...ఎవ‌రు స్వ‌ర్గానికి వెళ‌తారు....ఎవ‌రు న‌ర‌కానికి వెళ‌తారు....
 
చ‌చ్చిన శ‌రీరం నుండి  మ‌నిషి ఆత్మను తీసుకుని య‌మ‌దూత‌లు ప్ర‌యాణం ప్రారంభిస్తారు. వైత‌ర‌ణి న‌ది ప‌రిహాక ప్రాంతంలొ ఈ ప్ర‌యాణం అత్యంత భ‌యంక‌రంగా సాగుతూ ఉంటుంది. మ‌నిషి చేసిన పాప పుణ్యాలను బ‌ట్టి స్వ‌ర్గానికి వెళ్లాలా...న‌ర‌కానికి వెళ్లాలా అనేది నిర్ణ‌యించ‌బ‌డుతుంది.....
 
దేశానికి స‌మాజానికి సేవ చేసిన వారు,  స‌త్యాన్ని అనుస‌రించిన వారు  స్వర్గానికి వెళ్తార‌ని,    హ‌త్య‌లు, అక్రమాలు, మాన‌భంగాలు, దొంగతనాలు, క‌రుడుగ‌ట్టిన నేరాలు చేసిన వాళ్లు త‌ప్ప‌కుండా నరకానికే వెళ్తారని గరుడ పురాణం చెబుతోంది.
 
చ‌నిపోయాక ఆత్మ న‌ర‌కానికి  వెళ్లేట‌పుడు ప్ర‌యాణం ఎలా ఉంటుంది......
 
మ‌నిషి చ‌నిపోయాక న‌ర‌క ప్రయాణం  ఎలా ఉంటుందో గరుడ పురాణంలో  పూర్తిగా వివ‌రించబడింది. గరుడపురాణం ప్రకారం య‌మ‌పురి ప్ర‌యాణం అత్యంత క‌ష్టాల‌తో  సాగుతుంది. కొన్ని రోజుల పాటు  చిత్ర‌హింస‌ల‌కు గురి చేస్తూ... ఆత్మ‌ను త‌మ వెంట తీసుకెళుతారు య‌మ‌దూత‌లు. ఈ ప్రయాణంలో ఆత్మ అలసిపోయినా.. విశ్రాంతి తీసుకోవడానికి యమధూతలు అనుమతించరు.
 
ఇక ఆత్మ‌కు య‌మ‌భ‌టులు పెట్టే క్షోభ అంతా ఇంత కాదు. యమలోకానికి జరుగుతున్న ప్రయాణంలో ఆత్మను యమధూతలు చాలా భయాందోళనకు గురిచేస్తారు. నరకంలో యమరాజు  అమ‌లు  చేసే శిక్ష‌ల   గురించి వివరించి వ‌ణుకుపుట్టేలా చేస్తారు. ఈ స‌మ‌యంలో ఆత్మ ఏడవడం మొదలు పెడుతుంది. అయినా కూడా  యమధూతలు జాలి, క‌రుణ‌, క‌నిక‌రం చూపించ‌కుండా ఆత్మ‌ల‌ను  మ‌రింత బాధ‌పెడుతూ ఆనంద‌ప‌డుతుంటారు.
 
స్వర్గానికి వెళ్లేట‌పుడు  మాత్రం ఇలాంటి ఏవీ ఉండ‌వు..బ్రతికి ఉన్న‌పుడు వారు చేసిన పుణ్యాకార్యాల కార‌ణంగా ఆత్మ‌ల‌ను ఎలాంటి క్షోభ‌ల‌కు గురి చేయ‌కుండా స్వ‌ర్గానికి తీసుకెళ‌తారు. 
 
య‌మ‌లోకానికి వెళ్లిన ఆత్మ తిరిగి వ‌స్తుందా..వ‌స్తే ఎక్క‌డ తిరుగుతుంది.....
 
యమలోకానికి చేరిన త‌ర్వాత  యమరాజు చివ‌రి సారిగా ఆత్మను చనిపోయిన స్థలానికి పంపిస్తాడు. ఇన్నాళ్లు ఉన్న త‌న శ‌రీరం అంత్య‌క్రియ‌ల‌ను చూసుకునే అవ‌కాశాన్ని  ఆత్మ‌కు క‌ల్గిస్తాడు య‌మ‌రాజు. చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా .? లేదా. ? ఆత్మ శాంతి కోసం కర్మ నిర్వహిస్తారా... లేదా....అని తెలుసుకోవడానికి ఆత్మను మళ్లీ కిందకు పంపిస్తారని గ‌రుడ పురాణాలు చెబుతున్నాయి.
 
గరుడ పురాణం ప్రకారం.... వ్యక్తి చనిపోయిన తర్వాత  కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే.. ఆత్మ  య‌మ‌లోకానికి వెళ్ల‌కుండా ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది.  ఇక  కుటుంబ సభ్యులు 10 రోజుల లోపే పిండ ప్రదానం చేయాలి. లేక‌పోతే  ఆత్మకు మోక్షం ఉండదు.
 
గరుడ పురాణం ప్రకారం.. వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు 10 రోజుల లోపే ఖ‌ర్మ కాండ‌లు  నిర్వ‌హించ‌క‌పోతే  ఆత్మ య‌మ‌లోకానికి వెళ్ల‌కుండా  ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది. లేదా ఇక  ఆ ఆత్మకు మోక్షం ఉండరు
 
 
 
 
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.