రావి చెట్టుకు ఇలా చేస్తే మీకు ఐశ్వ‌ర్యం అలా చేస్తే దుర‌దృష్టం

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

ravi chettu
Updated:  2018-07-11 02:54:10

రావి చెట్టుకు ఇలా చేస్తే మీకు ఐశ్వ‌ర్యం అలా చేస్తే దుర‌దృష్టం

మ‌న‌కు పెద్ద‌లు చెట్ల‌ను కూడా దేవుళ్లుగా కొల‌వ‌డం మ‌న‌కు చిన్న‌త‌నం నుంచి నేర్పుతారు.. ఒక్కో చెట్టుని ఒక్కో  దేవుడి రూపంగా కొలుస్తాం. అయితే రావిచెట్టుని మ‌నం  ఎంతో శ్ర‌ద్ద‌గా పూజిస్తాం, అమ్మ‌వారి దేవాల‌యాలు గ్రామ‌దేవ‌త‌ల విగ్ర‌హాలు గుడులు కూడా రావిచెట్ల ద‌గ్గ‌ర ఉండ‌టం మ‌నం చూస్తూనే ఉంటాం.కాని రావిచెట్టుని రోజూ ముట్టుకుంటే మంచిది కాదు అని కూడా పెద్ద‌లు చెబుతారు.
 
చాలా మంది తెలిసో తెలియకో రావి చెట్టును రోజూ తాకుతూ, పూజిస్తుంటారు. ఇలా చేయడం లాభమా! నష్టమా! అంటే నష్టమని చెబుతున్నాయి మన పురాణాలు. ఇలాంటి విషయాలు పురాణాల వరకు అవసరం లేకుండా మన పెద్ద వారిని అడిగినా చెబుతారు. ఇంటి పరిసర ప్రాంతంలో రావి చెట్టు ఉంటే వెంటనే దానిని నరికివేస్తారు. తెల్లవారుజామున  నిద్రలేవగానే రావి చెట్టు చూస్తే అష్ట దరిద్రాలు పట్టుకుంటాయి అని చెబుతుంటారు…. మరి దీని వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
పాల సముద్రం చిలికిన సమయంలో లక్ష్మి దేవిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు శ్రీ మహా విష్ణువు.... కానీ లక్ష్మి దేవి… నాకంటే పెద్దయిన అక్క జ్యేష్ఠ లక్ష్మి పెళ్లి కాకుండా నేను  పెళ్లి చేసుకోను అని చెబుతుంది. ఈ విషయంపై బాగా ఆలోచించిన విష్ణువు తన భక్తుడైన ఒక మునికి జ్యేష్ఠ లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేస్తాడు... అతనితో కాపురానికి వెలుతుంది. ముని చాలా పవిత్రంగా రోజూ పూజలు చేయడం, శుభ్రంగా ఉండటం, నిత్యం హోమ గుండం, మంత్రజపం చేయడం ఆమెకు నచ్చేది కాదు. ఈ విషయాలతో విసిగిపోయిన జ్యేష్ఠ లక్ష్మి, మునిని నన్ను ఎక్కడైనా వేరే చోట దింపితే అక్కడే ఉంటాను అని చెబుతుంది... దీనితో ముని ఆమెను రావి చెట్టు మొదల్లో వదిలిపెడతాడు.
 
అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అక్కడ ఉండటం ఇష్టంలేక నన్ను ఇక్కడి  నుంచి ఎక్కడికైనా పంపించమని విష్ణు మూర్తిని ప్రాధేయపడుతుంది. దానితో విష్ణువు రావి చెట్టు మొదలు కంటే నీకు మంచి చోటు  ఎక్కడా దొరకదు అని చెబుతాడు. ఒక్కరు కూడా నన్ను పూజించడానికి రావడం లేదు అనడంతో, సరే వారంలో ఐదు రోజులు ఎవరూ రాకున్నా, చివరి రెండు రోజులు వచ్చి పూజిస్తారు అని వరం ఇస్తాడు జ్యేష్ట ల‌క్ష్మీకి . అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుంది అంటారు... శనివారం లేదా ఆదివారం చెట్టును తాకితే అదృష్టమని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ సారి మీరు కూడా మంచి ఫ‌లితం పొందాలి అంటే, శ‌నివారం ఆదివారం రావిచెట్టుని తాకాలి అని తెలుసుకోండి.. తెలియ‌ని వారికి తెలియ‌చేయండి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.