మ‌నిషి చ‌నిపోయే ముందు కుక్క‌లు అరుస్తాయా వాస్త‌వం ఏమిటి..?

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

Updated:  2018-09-14 04:06:44

మ‌నిషి చ‌నిపోయే ముందు కుక్క‌లు అరుస్తాయా వాస్త‌వం ఏమిటి..?

ఈ విశ్వంలో ఎక్క‌డ ఏం జ‌రిగినా ఓ కనెక్టివిటీ ఉంటుంది అవును సృష్టిలో జ‌రిగే ప్ర‌తీ దానికి ఓ కార‌ణం ఉంటుంది ఇక్క‌డ యాక్ష‌న్ ఉంటో ఎక్క‌డో రియాక్ష‌న్ అన్న‌ట్లు అయితే జంతువులు ప్ర‌మాదాల‌ను ప‌సిగ‌డ‌తాయి అనిఅలాగే కొన్ని నిమిషాల ముందు భూకంపం , సునామీ, అగ్ని ప‌ర్వ‌తం బ‌ద్ద‌ల‌వ్వ‌డం వంటి విప‌త్కారాలు ఏర్పడేట‌ప్పుడు జంతువులు గ్ర‌హిస్తాయి అంటారు అందులో వాస్త‌వం ఏమిటి అనేది తెలుసుకుంటే ప‌లు ప‌రిశోథ‌న‌ల్లో ఇది వాస్త‌వం అని తెలిసింది.
 
అయితే ఎక్కువ‌గా కుక్క‌ల గురించి చెప్పాలి ప్ర‌పంచంలో విశ్వాసం అంటే కెన‌డీ ఎలాగ గుర్తువ‌స్తారో అలాగే కుక్కులు కూడా గుర్తువ‌స్తాయి.. కుక్క‌ల‌కు అంత విశ్వాసం ఉంది.. అయితే కుక్క‌లు వాటి య‌జ‌మానుల‌తో ఎంతో అవినాభావ సంబంధం ఏర్ప‌ర‌చుకుంటాయి. దొంగ‌లు వస్తే వారిపై అటాక్ చేస్తాయి అలాగే య‌జ‌మానులు త‌మ‌నుంచి దూరంగా వెళ్లిపోతే వారి స‌మాధుల ద‌గ్గ‌రే బోరున విల‌పిస్తాయి.
 
అలాంటి కుక్క‌లు మనిషి చనిపోయే ముందు  అరుస్తాయి అని అంటారు కొంద‌రు. వారికి మనిషి ప్రాణం పోయే ముందు యమధర్మరాజుని చూస్తాయని , అందుకే తనకు తెలిసిన వారు గాని ,ఎవరైనా ఉంటె వారిని కాపాడటానికి అరుస్తాయని అంటారు. ఈ విషయం పైనే ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కుక్కలు మనిషి ప్రాణం పోయే ముందు ఎందుకు అరుస్తాయి అన్న దాని సైంటిస్టులు సీరియస్ గా తీసుకుని పరిశోధనలు కూడా చేశారు.
 
ఈ విషయం పై ఈ మధ్యనే ఒక సరికొత్త క్లారిటీ వచ్చింది. అమెరికాలోని  సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో కుక్కల స్పర్శా జ్ఞానం గురించిన విషయాలు తెలిశాయి. అందులో భాగంగా , కుక్కల ముక్కుకి వాసనని కనిపెట్టే శక్తి ఎక్కువ. కొన్ని కొన్ని కుక్కలు కిలోమీటర్ల దూరంలోని వాసనని పసిగట్టిన సంఘటనలు గురించి మనం విని ఉన్నాము. అయితే కుక్కలు , మనిషి చనిపోవడానికి ముందు అతని శరీరంలో జరిగే రసాయనిక చర్యల వల్ల వచ్చే వాసనని పసిగట్టగలవు. కుక్కలకు అలా పసిగట్టగలిగే శక్తి జన్యుపరంగా వచ్చింది. అందుకే కుక్కలు మనిషి చనిపోయే సమయంలో ఇంటి దగ్గర పెద్ద పెద్దగా అరుస్తాయి. కానీ , గాల్లోకి ఎక్కువగా ఎందుకు చూస్తాయి అన్నదానిపై ఇప్పటిదాకా వివరణ లేదు. ప్రాణం పోయే డప్పుడు , గుండె ఆగిపోయే క్షణంలో శరీరంలో విడుదల అయ్యే చిన్నపాటి విద్యుత్తుని అది గమనిస్తోంది అని అంటున్నారు నిజ‌మే కుక్క‌ల‌కు అంత శ‌క్తులు ఉన్నాయి కాబట్టే మ‌నం వాటిని అంత ప్రేమ‌గా పెంచుకుంటున్నాం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.