ఇండియా లో మొదటి శివాలయం ఎక్క‌డ ఉందో తెలుసా

Breaking News

హోమ్        ఆధ్యాత్మికం      న్యూస్

shivalayam
Updated:  2018-07-11 02:58:14

ఇండియా లో మొదటి శివాలయం ఎక్క‌డ ఉందో తెలుసా

శివుడు ఆదిదేవుడు అంటారు.. ఆనీల‌కంఠుడిని పూజించ‌ని గడ‌ప ఉండ‌దు.. దేవుల్లు -గుళ్లు  సంప్ర‌దాయాలు అన‌గానే  హిందువులు అంద‌రూ శివున్ని ఆదిదేవునిగా పూజిస్తారు.. వార‌ణాసిలో శివున్ని శ్రీశైల మ‌ల్ల‌న్న‌, పంచారామా క్షేత్రాల్లో ఉన్న శివుడు ఎవ‌రైనా అంతా శివుని రూపాలే అందుకే మ‌న‌దేశంలో శివునికి ప్ర‌తీ గ్రామంలో శివాల‌యం ఉంటుంది.
 
ఇక మ‌న దేశంలో మొద‌టి శివాల‌యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.... మన దేశంలోనే గుడి మల్లం దేవాలయానికి ఉన్న అత్యంత ప్రాధాన్యత మరే దేవాలయానికి ఉండదు... ఎందుకు అంటే ఇక్కడి శివలింగం అంటే అంత విశిష్టమైన‌ది... ఎంతో చ‌రిత్ర ఉన్న ఈ శివ‌లింగం గురించి, ప్ర‌తీ ఒక్క‌రూ తెలుసుకోవాలి.  ఆ  విష‌యాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
 
మనం తిరుపతికి వెళ్లే దారిలో రేణిగుంట సమీపంలో గుడిమల్లం అనే ఊరు ఉంది..  ఈ దేవాలయం ఇంత మారుమూల గ్రామం లో ఉండడం వల్ల మనకెవ్వరికి దీని విశిష్టత తెలియకుండా పోతోంది...ఇక్కడ గర్భాలయం అంతరాల‌యం కన్నా ఎత్తులో ఉండడం విశేషం.. మళ్ళీ మరెక్కడా కనిపించని శివలింగం  ఇక్క‌డ ఉంది.. అదే పురుష లింగం.. ఇక్కడ మాత్ర‌మే  దర్శనమిస్తుంది. ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఈ శివలింగం ఓ చేతిలో పశువును, మరోచేతోలో గొర్రెను పట్టుకొని ఉంటుంది.
 
ఇక్కడి లింగం సుమారుగా ఏడు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పులో ఉంటుంది. శివుడు తన రెండు చేతులతో ఎడమ భుజానికి ఒక గండ్ర గొడ్డలి తగిలించుకొని దర్శనమిస్తాడు. స్వామి జటాభార తలకట్టుతో, చెవులకు కర్ణాభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న వ‌స్త్రం  ధరించి కనిపిస్తాడు.
 
ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు ఎలా కనిపిస్తాయంటే అతి స్పష్టముగా కనిపిస్తాయి. ఆ వస్త్రము కోమలంగా అతి సున్నితమైనది అన్నట్లుగా శివుని శరీరపుభాగములు కనపడుతుంటాయి. ఇక్క‌డ శివునికి యజ్ఞోపవీతం లేకపోవడం ఒక విశేషం.. ఇక్క‌డ స్వామి ఆదిదేవునిగా అవ‌త‌రించారు అని చెబుతారు.. మ‌న దేశంలో ఇదే మొద‌టి శివ‌లింగం ఉద్బ‌వించ‌డం అంటారు ఇక్క‌డ స్ధానికులు.. ఈసారి ఈ ప్రాంతానికి వెళ్లిన స‌మ‌యంలో ఇక్క‌డ దేవాల‌యం సంద‌ర్శించి ఆదిదేవుని ద‌ర్శ‌నం చేసుకోండి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.