అమీర్ పేట్ అమ్మాయిలు వ్య‌భిచారులు ద‌ర్శ‌కుడి నోటిదుర‌ద‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-01 04:47:28

అమీర్ పేట్ అమ్మాయిలు వ్య‌భిచారులు ద‌ర్శ‌కుడి నోటిదుర‌ద‌

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొంత‌మంది న‌టీ, న‌టులు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ఒక‌రిపై ఒక‌రు త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.... అయితే కొద్ది రోజుల క్రితం  ప‌వ‌న్ అభిమానులు సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ ల‌మ‌ధ్య  వార్  సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.
 
ఈ క్ర‌మంలో  ద‌ర్శ‌కుడు అజ‌య్ కౌండిన్యా  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి ప్ర‌స్తుతం సాంకేతిక మాధ్య‌మాల‌లో నిలుస్తున్నారు.. ఈ నేప‌థ్యంలో బూత్ బంగ్లా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా కౌండిన్యా వివ‌ధ ప్రాంతాల నుంచి చ‌దువుకునేందుకు అమీర్ పేట్ కు వ‌చ్చిన విద్యార్థులు, పోలీస్ బాస్ లు వ్య‌భిచారులంటూ వ్యాఖ్య‌లు చేశారు.
 
అయితే ఈ ప్ర‌మోష‌న్స్ లో కౌండిన్య చేసిన వ్యాఖ్య‌లు మ‌హిళ‌ల మ‌నో భావాలు దెబ్బ తినేవిధంగా మాట్లాడారంటూ మ‌హిళా సంఘాల అధ్య‌క్షురాలు జిన్నెల సురేఖ బంజారాహిల్స్ పోలీస్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు...ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ...  ఈ నెల 30న ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో తన వ్యాఖ్యలు నిరూపిస్తానని సమర్ధించుకుంటూ సవాల్ విసిరాడని ఆమె అన్నారు. 
 
అందులో భాగంగానే అమీర్ పేట విద్యార్ధులు, పోలీస్ బాస్ లు వ్యభిచారులని కౌండిన్యా అన‌డాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, అతనిని వెంట‌నే  శిక్షించాలని ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో  ఆమె ఫిర్యాదు మేర‌కు  పోలీసులు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.