ఆగష్టు 3 న రిలీజ్ అవుతున్న "బ్రాండ్ బాబు"

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-26 12:07:44

ఆగష్టు 3 న రిలీజ్ అవుతున్న "బ్రాండ్ బాబు"

బుల్లి తెర నటుడు ఇంకా యాంకర్ అయిన ప్రభాకర్ డైరెక్టర్ గా మారి "నెక్స్ట్ నువ్వే" అనే సినిమా చేసాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారి ఫ్లాప్ గా నిలిచింది. ఈ ఫ్లాప్ తరువాత వెంటనే ప్రభాకర్ "బ్రాండ్ బాబు" అని ఒక సినిమా స్టార్ట్ చేసాడు. 
 
సుమంత్ శైలేంద్ర హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఈశ రెబ్బ హీరోయిన్ గా నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ అయిన మారుతి ఈ సినిమాకి కథని అందించాడు. మురళి శర్మ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమాని ఆగష్టు 3 న రిలీజ్ చేద్దాం అని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శైలేంద్రబాబు మాట్లాడుతూ "మారుతీ ఈ సినిమాకి మంచి కథని అందించాడు, త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి జూలై 30 న ఆడియో రిలీజ్ ఈవెంట్ చేద్దాం అని అనుకుంటున్నాము" అని ఆయన అన్నాడు.
 
 జే.బి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మారుతి ఈ సినిమాకి కథ అందించాడు అని తెలియగానే ఈ సినిమా పై అందరి అంచనాలు పెరిపోయాయి. మరి తోలి సినిమాతో ఫ్లాప్ అందుకున్న ప్రభాకర్ ఈ సినిమాతో ఆయన హిట్టు కొడతాడో లేదో చూడాలి. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.