65వ జాతీయ అవార్డుల ప్రకటన

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

65th national awards
Updated:  2018-04-13 02:24:02

65వ జాతీయ అవార్డుల ప్రకటన

దేశంలో ప్ర‌తిష్టాత్మ‌క 65 వ జాతీయ అవార్డుల ప్రక‌ట‌న అట్ట‌హాసంగా ప్రారంభం అయింది... దిల్లీలో ఈ కార్య‌క్రమం జ‌రిగింది..  బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ ఈ అవార్డులను ప్రకటించారు. 2017లో విడుదలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో వచ్చిన అద్భుతమైన చిత్రాలను పరిగణలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు స‌భ్యులు..
 
ఈ అవార్డుల జ్యూరీ స‌భ్యులుగా ప్ర‌ముఖ న‌టి గౌత‌మి ఇంతియాజ్ హుస్సేన్ గేయ రచయిత మెహబూబ్‌, పి.శేషాద్రి అనిరుద్ధా రాయ్‌ చౌదరి, రంజిత్‌ దాస్‌, రాజేశ్‌ మపుస్కర్‌, త్రిపురారి శర్మ, రూమీ జఫ్రే ఉన్నారు. మే3న విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తారు.
 
!! ఓసారి అవార్డులు లిస్ట్ చూసిన‌ట్లు అయితే !!
ఉత్తమ నటి: శ్రీదేవి (మామ్‌)
 
ఉత్తమ తెలుగు చిత్రం: ఘాజీ
 
ఉత్తమ హిందీ చిత్రం: న్యూటన్
 
ఉత్తమ మలయాళీ చిత్రం: టేకాఫ్
 
ఉత్తమ తమిళ చిత్రం: టు లెట్‌
 
ఉత్తమ మరాఠీ చిత్రం: కచ్చా నింబూ
 
ఉత్తమ కన్నడ చిత్రం: హెబ్బెట్టు రామక్క
 
ఉత్తమ బెంగాలీ చిత్రం: మయురాక్షి
 
ఉత్తమ యాక్షన్‌ చిత్రం: బాహుబలి-2
 
ఉత్తమ సంగీత దర్శకుడు: ఏ.ఆర్‌ రెహమాన్‌ (మామ్‌), (కాట్రు వెలియిదాయ్‌)
 
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేశ్‌ ఆచార్య (టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా)
 
ఉత్తమ దర్శకుడు: జయరాజ్‌ (మలయాళ చిత్రం భయానకం)
 
ఉత్తమ సహాయ నటుడు: ఫహాద్ ఫాసిల్‌ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)
 
బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నాకు దాదాసాహెబ్‌ ఫాల్కే

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.