రాజీవ్ క‌న‌కాల ఇంట్లో విషాదం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-03 12:22:21

రాజీవ్ క‌న‌కాల ఇంట్లో విషాదం

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నేడు విషాదం చోటు చేసుకుంది.... దేవ‌దాస్ క‌న‌కాల స‌తీమ‌ణి ల‌క్ష్మిదేవి క‌న‌కాల, ఈ రోజు  ఉద‌యం మృతి చెందారు... గ‌త కొంత కాలంగా  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం స్వగృహంలో తుది శ్వాస విడిచారు.  
 
దేవ‌దాస్ క‌న‌కాల భార్య ల‌క్ష్మిక‌న‌కాల,  అనేక మంది న‌టీ న‌టుల‌కు శిక్ష‌ణ ఇచ్చి ప‌లువురుని తెలుగుచిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీర్చిదిద్దారు... చెన్నైలో దేవ‌దాస్ క‌న‌కాల ల‌క్ష్మి క‌న‌కాల వ‌ద్ద సినీ ప‌రిశ్ర‌మ‌లోకి రావాల‌నే ఉత్సాహం ఉన్న అనేక మంది శిక్ష‌ణ తీసుకున్నారు... అలా టాలీవుడ్ కోలీవుడ్ లో వీరు సినీమా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు గురువులుగా మారారు.
 
ల‌క్మిక‌న‌కాల మృతితో తెల‌గుచిత్ర ప‌రిశ్ర‌మ విషాదంలో మునిగింది... పరిశ్ర‌మ‌లో ప్ర‌ముఖులు ఆమెకు సంతాపం తెలిపారు.. దేవ‌దాస్ క‌న‌కాల ల‌క్మికి ఇద్ద‌రు సంతానం, ఒక‌రు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా రాణిస్తున్న రాజీవ్ మ‌రొక‌రు వారి కుమార్తె, ఇక రాజీవ్ భార్య సుమ తెలుగుచిత్ర ప‌రిశ్ర‌మ‌లో అంద‌రికి సుప‌రిచిత‌మే, బుల్లితెర యాంక‌ర్ల‌లో ఆమె ఇప్పుడు లీడ్ యాంక‌ర్ గా కొన‌సాగుతున్నారు.
 
ఇప్పుడు చిత్ర‌ప‌రిశ్ర‌మ ఏలుతున్న చిరంజీవి, ర‌జ‌నీకాంత్, సుధాక‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ , మొద‌లైన అగ్ర‌న‌టులు వీరివ‌ద్ద సినిమా విద్య నేర్చుకున్న‌వారే.
 
 
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.