రాజ‌మౌళి సినిమాలో మ‌రో స్టార్ హీరో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-29 05:25:08

రాజ‌మౌళి సినిమాలో మ‌రో స్టార్ హీరో

బాహుబ‌లి సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌పంచ‌స్థాయి, గుర్తింపు తెచ్చిపెట్టారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఈ సినిమా త‌ర్వాత జ‌క్క‌న్న సెట్స్ పైకి ఎటువంటి సినిమా తీసుకురాలేదు... అయితే చాలా రోజుల త‌ర్వాత తాను నిర్మించ‌బోతున్న చిత్రం మ‌ల్టీస్టారర్ అని అధికారికంగా జ‌క్క‌న్న ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.. కాగా ఈ సినిమాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాస్టార్ రామ్ చ‌ర‌ణ్ జంట హీరోలుగా న‌టించ‌నున్నారు... ఈ సినిమాకు సంబంధించి రాజ‌మౌళి తండ్రి క‌థ‌ను ఇంకా రెడీ చేస్తున్నారు.

అయితే ఈ క్ర‌మంలో జ‌క్క‌న్న ఈ ప్రాజెక్ట్ లో కి మ‌రో హీరోను తీసుకుంటున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి... ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తినాయ‌కుడిగా ఒక స్టార్ హీరోను తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది... ఇందుకోసం కొంత‌మంది హీరోల పేర్ల‌ను ప‌రిశీలించాడ‌ట‌.. పేర్ల‌ను ప‌రిశీలించిన వారిలో త‌మ పేరు ఉంటే బాగుంటుందని కొంత మంది ఆశిస్తున్నార‌ట‌...అయితే ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో, వైర‌ల్ అవుతున్నా రాజ‌మౌళి మాత్రం ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.