భాగమతి రివ్యూ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-26 01:27:25

భాగమతి రివ్యూ

జానర్ : థ్రిల్లర్‌

తారాగణం : అనుష్క, ఉన్ని ముకుందన్‌, జయరామ్‌, ఆశాశరత్‌, మురళీ శర్మ

సంగీతం : తమన్‌.ఎస్‌

దర్శకత్వం : జి. అశోక్‌

నిర్మాత : వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌


అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, పంచాక్ష‌రి వంటి సినిమాలు చేసి త‌నకంటూ లేడి ఓరియంటెడ్ సినిమాలలో ఓ క్రేజ్ సంపాదించుకుంది అనుష్క‌.. తాజాగా అనుష్క లీడ్‌ రోల్‌ లో తెరకెక్కిన థ్రిల్లర్‌ మూవీ భాగమతి. ఈ సినిమాను పిల్ల జ‌మిందార్, సుకుమారుడు వంటి హిట్ సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు అశోక్ తెర‌కెక్కించారు.. తాజాగా విడుద‌లైన ఈ సినిమా పై ఇప్పుడు ఓ లుక్కేద్దం

కథ :

సెంట్రల్‌ మినిస్టర్ ఈశ్వర్‌ ప్రసాద్ !!జయరామ్ !! నిజాయితీ గల రాజకీయనాయకుడు. ఆయనకు ఉన్న ఇమేజ్‌ చూసి ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎలాగైన ఈశ్వర్ ప్రసాద్‌ ను కట్టడి చేయాలని భావిస్తారు. అందుకోసం ఎలాగైన ఈశ్వర్‌ ప్రసాద్‌ అవినీతి పరుడని నిరూపించాలని.. ఆ బాధ్యతను సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వైష్ణవి నటరాజన్ !! ఆశా శరత్కు!! కు అప్పగిస్తారు. వైష్ణవి, ఈశ్వర్‌ ప్రసాద్ ను ఇరికించేందుకు ఆయన దగ్గర రెండు సార్లు సెక్రటరీగా పనిచేసిన చెంచలా ఐఏఎస్ !! అనుష్క!! ను విచారించాలని నిర్ణయించుకుంటుంది.

తన ప్రియుడ్ని చంపిన కేసులో జైల్లో ఉన్న చెంచలను ప్రజల మధ్య విచారించటం కరెక్ట్ కాదని, ఊరికి దూరంగా అడవిలో ఉన్న భాగమతి బంగ్లాలో విచారించాలని నిర్ణయిస్తారు. బంగ్లాలోకి ఎంటర్‌ అయిన తరువాత చెంచల వింతగా ప్రవర్తిస్తుంది. తనను ఎవరో కొడుతున్నారని అరుస్తూ, అప్పుడప్పుడూ అరబిక్‌ భాషలో మాట్లాడుతూ పోలీసులను భయపెడుతుంది. చెంచల అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి..? మినిస్టర్‌ ఈశ్వర్‌ ప్రసాద్‌ మీద మచ్చ వేయాలన్న కుట్ర ఎందుకు జరిగింది..? చెంచల తన ప్రియుడ్ని ఎందుకు చంపాల్సి వచ్చింది..? ఈ సమస్యల నుంచి చెంచల ఎలా బయటపడింది..? అన్నది వెండి తెర‌పై చూడాల్సిందే.

విశ్లేష‌ణ !!

త‌న పాత‌ ఓరియంటెడ్ సినిమాలలో క‌న్నా ఈ సినిమాలో అదే స్ధాయి న‌ట‌న‌ను చూపింది అనుష్క‌. ఐఏఎస్‌ ఆఫీసర్‌ చెంచలగా హుందాగా కనిపించిన స్వీటీ, భాగమతిగా రౌద్ర రసాన్ని కూడా అద్భుతంగా పలికించింది. హీరోగా ఉన్ని ముకుంద‌న్ కూడా మెప్పించారు.. ఇక మంత్రిగా గెట‌ప్ లో జ‌య‌రామ్ ఈశ్వ‌ర‌న్ గా కూడా బాగా న‌టించారు అనే చెప్పాలి.

హీరోగా నటించిన ఉన్ని ముకుందన్ ది చిన్న పాత్రే అయినా, తనదైన హావ భావాలతో మెప్పించాడు . సీబీఐ జేడీ పాత్రలో ఆశా శరత్‌ నటన బాగానే ఉన్నా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉన్న నటి కాకపోవటంతో అంతగా కనెక్ట్ కాలేదు సినిమాలో ప్రేక్ష‌కులు. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, ధనరాజ్, విధ్యుల్లేఖ రామన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు...డైరెక్ట‌ర్ అశోక్ క‌థ‌ను బాగా తెర‌కెక్కించారు విజువ‌ల్ ఎఫెక్ట్ మ‌రో స్టేజ్ కు తీసుకువెళ్లాయి సినిమాను.. త‌మ‌న్ మ్యూజిక్ అద్బుతం అనే చెప్పాలి.. సినిమాటోగ్రఫి కూడా సినిమాను మరో మెట్టు ఎక్కించింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్ధాయికి తగ్గట్టుగా ఉన్నాయి. అశోక్ క‌థ‌ను అద్బుతంగా మ‌లిచారు.. మొత్తానికి భాగ‌మ‌తి స‌గ‌టు ప్రేక్ష‌కుడికి న‌చ్చుతుంది.

ప్లస్ పాయింట్స్ :

క‌థ‌నం
డైరెక్ట‌ర్ టేకింగ్
నేపథ్య సంగీతం
అనుష్క నటన

మైనస్ పాయింట్స్ :

కాస్త క‌థ‌నం తిక‌మ‌క పెట్ట‌డం

భాగ‌మ‌తిని భ‌యం లేకుండా చూడ‌వ‌చ్చు

రేటింగ్ 3

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.