బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టిన‌ పూజ హెగ్డే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-01 03:11:50

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టిన‌ పూజ హెగ్డే

ముకుంద సినిమా ద్వారా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు   పరిచయం అయిన‌ క‌థానాయిక పూజ హెగ్డే.  ఈ చిత్రంలో  గోపిక‌మ్మా అనే పాట ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో స్థానం సంపాదించింది. ఒక లైలా కోసం సినిమాలో న‌టించిన పూజాకు బాలీవుడ్‌ ద‌ర్శ‌కుడు  అశుతోష్ గోవారికర్ త‌న సినిమా మొహంజదారో లో హీరోయిన్‌గా అవ‌కాశం క‌ల్పించారు. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది.
 
ఆ తర్వాత‌  టాలీవుడ్‌లో డిజే సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న‌ ప్ర‌త్య‌క్ష‌మైంది పూజ హెగ్డే.  ఈ సినిమాలో బికిని వేసి త‌న అందాల‌తో ప్రేక్ష‌కులను మైమ‌రిపించి చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఆక‌ర్షించింది.  త‌ర్వాత టాలీవుడ్‌లో సాక్ష్యం, రంగ‌స్థ‌లం సినిమాలు, బాలీవుడ్‌లో రేస్‌3 సినిమాలో బిజీగా ఉంది హీరోయిన్  పూజ హెగ్డే. వ‌రుస అవ‌కాశాల‌తో స్పీడుమీదున్న ఈ అమ్మ‌డుకు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది.
 
ప్రిన్స్‌ మహేష్‌ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేష‌న్ లో   సిల్వర్‌ జూబ్లీ అనే  సినిమా తెరెకెక్కించ‌నున్నారు. ఈ చిత్రానికి  క‌థానాయిక‌గా పూజ హెగ్డే ఎంపికైంది. ఈ విష‌యాన్ని పూజా హెగ్డే సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ చిత్రంలో న‌టిస్తున్నందుకు ఆనందంగా ఉంది.... అందరం కలిసి ఒక చ‌క్క‌టి చిత్రాన్ని మీకందించేందుకు ఎదురుచూస్తున్నాం...... అంటూ ట్వీట్‌ చేశారు పూజ. దీనికి  స్పందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి తనతో కలిసి వర్క్‌ చేయటం ఆనందంగా ఉందని రీట్వీట్ చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.