షాకింగ్ రామ్ గోపాల్ వ‌ర్మ పై కేసు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-23 04:26:58

షాకింగ్ రామ్ గోపాల్ వ‌ర్మ పై కేసు

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం ఏది చేసినా సంచ‌ల‌నంగా మారుతోంది... ఇప్ప‌టికే ప‌లువురు  రాజ‌కీయ నేత‌ల‌పై  అలాగే న‌టీన‌టుల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు చేస్తూ సోష‌ల్ మీడియాలో వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారారు.. అయితే ఈ నేప‌థ్యంలో కొంత కాలంగా  వెండితెర‌ పై వ‌ర్మ త‌న ద‌ర్శ‌క‌త్వానికి  స్వ‌స్తిచెప్పి వెబ్ సిరీస్ సినిమాల‌కు ఆస‌క్తి చూపుతున్నారు... వెబ్ సిరీస్ లో సినిమాలు తీస్తే  సెన్సార్ బోర్డుకు ఎలాంటి సంబంధం ఉండ‌దనే ఉద్దేశ్యంతో వ‌ర్మ వెబ్ సిరీస్ పై ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నారు.
 
ఈ నేపథ్యంలో వర్మ వెబ్ సిరీస్ లో తెర‌కెక్కించిన చిత్రం గాడ్ సెక్స్ అండ్ ట్రూత్... ఈ చిత్రంలో అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవా న‌టించారు... ఈ సినిమాను వ‌ర్మ త్వ‌ర‌లో  విడుద‌ల చేయ‌బోతున్న నేప‌థ్యంలో జాతీయ మ‌హిళా సంఘాలస‌భ్యులు ఈ చిత్రం పై త‌మ ఆగ్రహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.. భార‌త సంస్కృతిని భ్ర‌ష్టు ప‌ట్టించ‌డ‌మే కాకుండా, మ‌హిళ‌ల‌ను కించ ప‌రిచే విధంగా వ‌ర్మ సినిమాల‌ను తిస్తున్నార‌ని  వారు మండిప‌డుతున్నారు.
 
తాజాగా మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచేందుకు అనంత‌పురం జిల్లా బీజేపీ నేత‌లు నేడు వ‌ర్మ పై  టూటౌన్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు... స‌మాజాన్ని కించ‌ప‌రుస్తూ సినిమాల‌ను తీస్తున్నరామ్ గోపాల్ వ‌ర్మ‌ను, వెంట‌నే పోలీసులు  కేసు న‌మోదు చేసి అరెస్ట్  చేయాల‌ని బీజేపీ నేత‌లు పేర్కోన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.