కత్తి మ‌హేష్ కొత్త టార్గేట్ ఎవ‌రో తెలుసా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-03 12:35:15

కత్తి మ‌హేష్ కొత్త టార్గేట్ ఎవ‌రో తెలుసా

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు క‌త్తి మ‌హేష్‌కు మ‌ధ్య జ‌రిగిన వివాదం అంద‌రికి తెలిసిందే.  ఈ వివాదంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌య‌మైన వ్య‌క్తి  సినీక్రిటిక్ క‌త్తి మ‌హేష్‌. ఇటీవ‌ల రామ్ గొపాల్‌వ‌ర్మ తెర‌కెక్కించిన జిఎస్టీ సినిమా పై  వివాదాలు త‌లెత్తాయి. ఈ వివాదానికి సంబంధించిన చ‌ర్చా కార్య‌క్ర‌మాల్లో  ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌తో పాటు  క్రిటిక్ క‌త్తి మ‌హేష్ కూడా  పాల్గొనేవారు.
 
వివాద‌మే మా అడ్డా అన్న‌ట్టు వ‌ర్మ, క‌త్తి మ‌హేష్ ఒకే తాటి పై న‌డుస్తున్నారు..... ప‌ర‌స్ప‌రం  ఒక‌రినొక‌రు పొగుడుకుంటూ ఎవ‌రి దారిలో వారు వెళుతున్నారు.  ఇటీవ‌ల వ‌ర్మ క‌త్తి  మ‌హేష్‌కు ఓ ట్వీట్ చేశారు... మనం తీసుకునే ఏదైనా నిర్ణయం కాస్త లేట్ అయిందంటే మన సమయంలో కొంత వేస్ట్ అయినట్టే.. టైమ్ వేస్ట్ అయిందంటే దాని అర్థం మన లైఫ్‌ వేస్ట్ అయినట్టే. అంటూ టైమ్ వేస్ట్ గురించి ట్వీట్ చేశారు.
 
ఈ ట్వీట్‌కు స్పందించిన  క‌త్తి మ‌హేష్ రామ్ గొపాల్‌వ‌ర్మను టార్గెట్  చేస్తూ, నువ్వు లైఫ్ వేస్ట్ చేసుకోవడాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఆ విషయంలో నిన్ను చూస్తే నాకు అసూయ క‌లుగుతుంది అని  రిట్వీట్ చేశారు క‌త్తి మ‌హేష్‌.. దీనిని చూసిన నెటిజ‌న్లు దొందూ దొందే అని రీట్వీట్లు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.