యాంక‌ర్ కు వేధింపులు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-27 06:41:20

యాంక‌ర్ కు వేధింపులు

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం అనేక చ‌ట్టాలు అమ‌లు చేసినా, అత్యాచారాలు , మాన‌భంగాలు మాత్రం ఆగ‌డం లేదు... దీంతో ప‌గ‌టి వేల కూడా మ‌హిళ‌లు ఒంట‌రిగా ఎక్క‌డికైనా వెళ్లాలంటే బిక్కు బిక్కు మంటున్నారు... దారిలో ఎవ‌రు ఏం చేస్తారో తెలియ‌క, ఎలాగైతే వెళ్లారో అలానే తిరిగి వ‌స్తామ‌న్న న‌మ్మ‌కం లేని స‌మాజంలో జీవిస్తున్నారు మ‌హిళ‌లు.

అయితే ఈ నేప‌థ్యంలో ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ లో యాంక‌ర్ గా ప‌ని చేస్తున్నఓ యువ‌తిని శ్రీకాకుళానికి చెందిన ర‌వీంద‌ర్ అనే యువ‌కుడు ప్రేమిస్తున్నానంటూ వెంట ప‌డుతున్నాడు... త‌న‌కు వివాహం అయింద‌ని చెప్పినా కూడా విన‌కుండా ర‌వీంద‌ర్ పెళ్లి చేసుకుంటాన‌ని ఆమెను వేధిస్తున్నాడు.

నేడు ఏకంగా ఆ యువ‌తి ప‌నిచేస్తున్న ఛాన‌ల్ ఆఫీస్ లోకి వెళ్లి స‌ద‌రు సిబ్బంది సమక్షంలోనే ఆమెని పెళ్లి చేసుకుంటానని వేధించాడు. దీంతో నిందితుడి టార్చర్ తట్టుకోలేని ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వెంటనే అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు, ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.