ఎన్టీఆర్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు నిజ‌మేనా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-24 12:55:05

ఎన్టీఆర్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు నిజ‌మేనా

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బ‌యోపిక్ ల హావా న‌డుస్తోంది ఈ సినిమాల‌పై తాజాగా ద‌ర్శ‌కుడు దృష్టి పెట్టారు... ఇటు టాలీవుడ్అటు కోలీవుడ్ లో ద‌ర్శ‌కుడు బ‌యోపిక్ ల పై కాస్త కాన్స‌న్ట్రేష‌న్ చేస్తున్న విష‌యం తెలిసిందే.. తాజాగా  అల‌నాటి సీనియ‌ర్ న‌టుడు యుగపురుషుడు అయిన ఎన్టీఆర్ జీవితాన్ని  ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సినిమాను నిర్మించ‌నున్నారు... వ‌ర్మ నిర్మించ‌నున్న ఈ సినిమా పై అనేక మంది విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే.
 
భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అల‌నాటి న‌టి సావిత్రి...  1949లో  ఎల్వీ ప్ర‌సాద్   ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం సంసారం... ఈ సినిమాలో సావిత్రి  చిన్న పాత్ర‌లో న‌టించి, ఆ త‌ర్వాత పాతాళ భైర‌వి, దేవ‌దాసు, మిస్సమ్మ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించారు.
 
తెలుగు సినీ ప్ర‌పంచంలో అంత‌టి గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి  జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం మ‌హాన‌టీ... ఈ సినిమాలో కీర్తిసురేష్‌ టైటిల్‌రోల్‌ పోషిస్తుండగా, జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్,  జమునగా సమంత, ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు, అక్కినేని నాగేశ్వరరావుగా విజయ్‌ దేవరకొండ, జానకిగా షాలిని పాండే, చక్రపాణిగా ప్రకాశ్‌రాజ్ న‌టించ‌నున్నార‌ట‌... అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం నందమూరి తారక రామారావు‌ పాత్రలో నేచురల్‌ స్టార్‌ నాని నటించనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది..మ‌రి ఇది ఎంత వ‌ర‌కూ వాస్త‌వ‌మో తెలియాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.