ప్లీస్ అలా చేయ‌కండి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-31 04:24:49

ప్లీస్ అలా చేయ‌కండి

టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్థానాన్ని ఏర్ప‌రచుకుంది న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్...  ఈ అమ్మ‌డు గ‌తంలో  బృందావ‌నం, డార్లింగ్, ఖైదీ నెం 150 సినిమాల్లో న‌టించి అగ్ర‌హీరోల‌తో హిట్లు అందుకుంది.. ఈ హిట్స్ తో  తిరుగులేని విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది కాజ‌ల్ .. అయితే ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం టాలీవుడ్ లోనే కాకుండా త‌మిళంలోనూ ప‌లు చిత్రాల‌ను చేస్తూ కోలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉంది.
 
తాజాగా ఓ మీడియా ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో  కాజ‌ల్ మాట్లాడుతూ... తాను హీరోయిన్ అయిన త‌ర్వాత అధిక సంఖ్య‌లో త‌నకు అభిమానులు ప్రేమ లేఖ‌లు రాయ‌డం మొద‌లు పెట్టార‌న్నారు...  అయితే త‌న‌కు వ‌చ్చిన లేఖ‌ల‌లో కొటేష‌న్స్ రూపంలో లేఖ‌ల‌ను రాస్తూ వారికి త‌న మీద ఎంత ప్రేమ ఉందో లెట‌ర్ ద్వారా తెలియ చేస్తుంటార‌ని  చెప్పింది కాజ‌ల్.
 
అయితే అభిమానులు రాసిన లేఖ‌ల‌న్నీ  తానే స్వ‌యంగా చ‌దువుతాన‌ని కాజ‌ల్ తెలిపారు... ఈ లెట‌ర్స్ పంపిన వారిలో చాలా మంది ర‌క్తంతో రాస్తుంటార‌ని వాటిని చ‌ద‌వాలంటే భ‌య‌మేస్తుంద‌ని చెప్పారు... త‌న‌కు ఎన్ని ప్రేమ లేఖ‌లు రాసినా ప‌ర్వాలేదు కాని ర‌క్తంతో మాత్రం రాయ‌కండని కాజ‌ల్ మీడియా ద్వారా తెలిపారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.