క‌త్తి మ‌హేష్ ప‌వ‌న్ పై సంచ‌ల‌న కామెంట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-29 05:53:36

క‌త్తి మ‌హేష్ ప‌వ‌న్ పై సంచ‌ల‌న కామెంట్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌లోరే.. చ‌లోరే క‌రువు యాత్ర‌లో భాగంగా ఈ రోజు పుట్టప‌ర్తి స‌త్య సాయి బాబాను ద‌ర్శించుకున్నారు... ద‌ర్శ‌నం త‌ర్వాత అనంత రైతుల స‌మ‌స్య‌ల‌ను నేరుగా అడిగి తెలుసుకున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్... ఈ క‌రువు యాత్ర‌లో తెలుగు దేశంపార్టీ నాయ‌కుల‌ను క‌ల‌వ‌డం ప‌ట్ల అనేక విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్నాయి.. అయితే ఈ నేప‌థ్యంలో న‌టి పూన‌మ్ కౌర్ సోష‌ల్ మీడియాను వేధిక‌గా చేసుకుని ప‌రోక్షంగా పవ‌న్ ని విమ‌ర్శిస్తూ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

కాగా సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ కూడా ప‌వ‌న్ చ‌లోరే..చ‌లోరే క‌రువు యాత్ర పై విమ‌ర్శించిన‌ట్లు తెలుస్తోంది.. అయితే క‌త్తి పేరు రాయ‌కుండా త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ చేశారు ... ఈట్వీట్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టి ఉంటాడ‌ని కొంత మంది నెటిజ‌న్లు అనుమానిస్తున్నారు.. క‌త్తి త‌న ట్విట్ట‌ర్ లో ఇలా పేర్కొంటూ ‘‘తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం. సమస్య ఇంకా బేసిక్ లెవల్‌లోనే ఉందని. ఇప్పటికీ ఆలస్యం కాలేదని. ఏదో ఒకటి చెయ్యొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాల వైపు వచ్చేలోగా ఎంతో కొంత మారొచ్చూ అంటూ మహేష్ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.

ఈ ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతోంది. మ‌రి ఈ ట్వీట్ పై జ‌న‌సేన కార్య క‌ర్త‌లు, ప‌వ‌న్ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.