పిచ్చి వర్మ కీర‌వాణి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-29 01:33:46

పిచ్చి వర్మ కీర‌వాణి

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఉండే ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా ఉన్నారు అంటే అది రామ్ గోపాల్ వ‌ర్మనే . అయితే ఇటీవ‌ల !! గాడ్ సెక్స్ అండ్ ట్రూత్!! అనే షార్ట్ ఫిల్మ్ ను తీశాడు వ‌ర్మ... ఈ ల‌ఘు చిత్రంలో పోర్న్‌స్టార్ మియా మాల్కొవా న‌టించిన విష‌యం తెలిసిందే.... ఈ సినిమా విడుద‌ల స‌మ‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు, ప‌లు మ‌హిళా సంఘాలు జీఎస్టీని తీవ్రంగా వ్య‌తిరేకించి నిర‌స‌న‌లు తెలిపారు వ‌ర్మ పై కేసులు పెట్టారు.

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ షార్ట్ ఫిలిమ్ కు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి బాణీలు అందించారు.. మియా అందాన్ని వ‌ర్ణించే స‌మ‌యంలో, ఆయ‌న బాణీలు మ‌రింత సినీమా బ్యాగ్రౌండ్ కు మ‌ధురు అనుభూతిని క‌లిగిస్తాయి. తాజాగా దీనిపై బాణీల వాణి కీర‌వాణీ స్పందించారు.

త‌న సంగీతాన్ని జీఎస్టీతో మ‌రో మెట్టు ఎక్కించాడంటూ వ‌ర్మ పై పొగ‌డ్త‌ల ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు కీర‌వాణి. 1991లో రొమాన్స్‌ను 1992లో కామెడీని, 2018లో సెక్స్ లాంటి చిత్రాల‌కు నాతో రాగాలు ప‌లికించాడు. ఈ యేడాది తీయ‌బొయే హ‌ర్ర‌ర్ , వయొలెన్స్ సినిమాల‌కు సైతం కీర‌వాణితోనే సంగీతం అందించాలి అని అనుకుంటున్నారు వ‌ర్మ‌.

నన్ను ఇంత‌గా న‌మ్మిన పిచ్చి వ‌ర్మకు కృతజ్ఞతలు అంటూ కీరవాణి ఓ ట్వీట్‌ చేశారు... కీరవాణి ట్వీట్ చూసిన రామ్‌గొపాల్ వ‌ర్మ థ్యాంక్స్ అంటూ బ‌దులిచ్చారు...మొత్తానికి మియా మాల్కొవాను తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసి ఒక ట్రెండ్ సృష్టించారు వివాదాల ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.