అజ్ఞాతవాసికి షాక్ లీగల్ నోటీస్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-01-21 12:17:57

అజ్ఞాతవాసికి షాక్ లీగల్ నోటీస్

ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 25 చిత్రం అజ్ఞాత‌వాసి... ఈ సినిమాను ద‌ర్శ‌క నిర్మాతలు ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుక‌గా విడుద‌ల చేశారు... భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన‌ అజ్ఞాత‌వాసి చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అభిమానుల‌ను అల‌రించ‌లేకపోతోంది.. అయితే ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ నిర్మించిన ఈ సినిమాకు ఊహించిన‌ రీతిలో త్రివిక్ర‌మ్ త‌న గ‌త సినిమాల మార్క్ చూపించ‌లేక‌పోయారు.

 

ఈ నేప‌థ్యంలోనే మాట‌ల మాంత్రికుడు మ‌రోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు... తాను నిర్మించిన అజ్ఞాత‌వాసి సినిమా  ఇంత‌కు ముందే ఫ్రెంచ్ ద‌ర్శ‌కుడు జెరోమ్ సాలీ చిత్రించారు... అయితే అదే క‌థ‌ను త్రివిక్ర‌మ్ కాపీ కొట్టాడ‌న్న ఉద్దేశంతో ఫ్రెంచ్ ద‌ర్శ‌కుడు హుటాహుటీన హైద‌రాబాద్ కు చేరుకుని ప‌రిశీలించారు.

 

అజ్ఞాత‌వాసి సినిమా విడుద‌లై సుమారు వారం రోజులు దాటినా, త‌న ఆరోప‌ణ‌ల‌కు చిత్ర యూనిట్ త‌రుపునుంచి...ఎలాంటి స్పంద‌న రాలేదు... దీంతో చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే ముందు మార్గ‌మ‌ని భావించి అజ్ఞాత‌వాసి యాజ‌మాన్యంపై  లీగ‌ల్ నోటీసులు జారీ చేస్తున్న‌ట్లు సాలీ ట్విట్ట‌ర్ లో పేర్కోన్నారు.  

 

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.