ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఇందిరాగాంధీ రోల్ ఎవ‌రిదో...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-03 05:51:27

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఇందిరాగాంధీ రోల్ ఎవ‌రిదో...

పిక్ నిక్  కు వెళ్లిన‌ట్టు బ‌యోపిక్ లు తీయ‌డంలో వ‌ర్మ స్టైలే వేరు తాజాగా ఆయ‌న ఎన్టీఆర్ పై బ‌యోపిక తీస్తాను అని చెప్పారు మొత్తానికి ఏం జ‌రిగిందో తెలియ‌దు కాని బాల‌య్య లీడ్ రోల్ సినిమా నుంచి వ‌ర్మ త‌ప్పుకున్నారు ఆ సినిమాను వ‌ర్మ శిష్యుడు తేజ తెర‌కెక్కిస్తున్నారు.. అలాగే వ‌ర్మ కూడా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనే ఓ స‌రికొత్త టైటిల్ తో ముందుకు వ‌చ్చారు..
 
తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ  చిత్రంలో ఎన్టీఆర్ రోల్‌ను బాల‌కృష్ణ పోషిస్తున్నారు. ఇప్ప‌టికే  ఈ చిత్రానికి సంబందించిన  ఫస్ట్‌లుక్ - టీజ‌ర్ విడుద‌ల చేశారు చిత్ర యూనిట్... ఈ టీజ‌ర్‌కు భారీ  స్పంద‌న వ‌స్తోంది... ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు రాస్తుంటే, సంగీత వాణి.. కీరవాణి స్వ‌రాలు అందిస్తున్నారు. 
 
తాజాగా ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్ర చేయ‌డానికి అల‌నాటి తార‌లైన‌టువంటి విజ‌య‌శాంతి, నదియా ల‌ను ద‌ర్శ‌కుడు తేజ సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం.  ఇందిరాగాంధీని ఢీకొట్టేందుకే ఎన్టీఆర్  టీడీపీని  - తెలుగు ఆత్మ‌గౌర‌వ నినాదంతో స్థాపించారు. ఇందిరాగాంధీ పాత్ర  సినిమాకు హైలెట్ కాబ‌ట్టి...బాల‌య్య సినిమాలో విజ‌య‌శాంతి ఉంటే త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంది అని చిత్ర యూనిట్ భావిస్తోంద‌ట‌. 
 
బాల‌య్య‌కు ధీటుగా ఎన్టీఆర్‌ను ఢీ కొట్టే ఇందిరాగాంధీ  పాత్ర‌కు న‌దియా ఎంపిక‌వుతుందా లేదా విజ‌య‌శాంతి ఎంపిక‌వుతుందో అన్న‌ది  వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.